Artificial Intelligence : ఇండియా, అమెరికా, బ్రిటన్, వియత్నాం, ఫిలిప్పీన్స్… ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఓ కుదుపు కుదిపేస్తోంది.
ఏఐ టెక్నాలజీతో చాలా పనులను ఆటోమేట్ చేయొచ్చు కాబట్టి, ఉద్యోగుల అవసరం రోజురోజుకీ తగ్గిపోతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ కారణంగానే అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాల్లోని టెక్ కంపెనీలు కళ్లు మూసుకుని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ, ఇండియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని నోమురా హోల్డింగ్స్ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనివిధంగా, ఇండియాలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి కంటే.. ఏఐ కోసమే కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని నోమురా హోల్డింగ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
Read Also: Donald Trump: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక ఆదేశాలు..
Artificial Intelligence
Artificial Intelligence : ‘రియల్-వరల్డ్ టెస్ట్ కేస్’గా మారిన ఇండియా
ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఈ ఒక్క విషయం ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్రస్తుతం టెక్ ఉద్యోగుల మధ్య ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలు పోతాయనే అపోహ ఉన్న తరుణంలో, కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టించవచ్చో, జాబ్ మార్కెట్‌లో సమతుల్యతను ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఇండియా ఒక ‘రియల్-వరల్డ్ టెస్ట్ కేస్’గా మారింది. ప్రపంచ దేశాలకు ‘బ్యాక్ ఆఫీస్’గా పేరుగాంచిన ఇండియాలో ఎన్నో రకాల, ఎన్నో రంగాలకు చెందిన ఐటీ సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండాలి.
దేశ భద్రతకే ముప్పు: పాక్ 'హనీట్రాప్' వలలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అరెస్ట్!

