Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియాపై ప్రశంసలు కురిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి

ఇండియాపై ప్రశంసలు కురిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి

వార్త 2 months ago

భారత్‌పై ఇరాన్ (Iran) సుప్రీం లీడర్‌కు ఇండియాలో ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహి (Abdul Majeed Hakim Elahi) ప్రశంసలు కురిపించారు. నమ్మకానికి, మానవత్వానికి భారత్ నిలయమని కొనియాడారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంతాప సభలో అబ్దుల్ మజీద్ పాల్గొన్నారు. ఈ క్రమంలో విలేకరులలో మాట్లాడుతూ భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బడుగుల పక్షాన నిలిచారని అబ్దుల్ మజీద్ హకీం వ్యాఖ్యానించారు. అయతుల్లా ఖమేనీ సంతాప సభకు భారత ప్రజలు స్వేచ్ఛతో వచ్చారని తెలిపారు. ఈ ప్రజలను ఎవరూ బలవంతం చేయలేదన్నారు. ఇది నమ్మకానికి, మానవత్వానికి, నైతికతకు భారత్ నిలయమని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు.

Read Also: IWI Negev LMG India: భారత్ కు అత్యాధునిక మెషిన్ గన్‌లు అందజేసిన IWI

 Iran Representative

Iran Representative: ఖమేనీ సంతాప సభలో పాల్గొన్న అబ్దుల్ మజీద్

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడులే పశ్చిమాసియా సంఘర్షణకు దారితీశాయి. అయితే అయతొల్లా అలీ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా భారత్‌లోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా యూపీలోని లఖ్‌నవూలో అయతొల్లా ఖమేనీ సంతాప సభను ఏర్పాటు చేయగా, అందులో ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్‌లో ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహి పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత్‌పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని కోరారు. తమ దేశంపై అమెరికా- ఇజ్రాయెల్‌ అకారణంగా దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడి విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha