Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IndVsPak: అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌పై భారీ అంచనాలు

IndVsPak: అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌పై భారీ అంచనాలు

వార్త 3 months ago

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు వినగానే ప్రత్యర్థి బౌలర్లలో భయం కలుగుతుంది. తొలి బంతి నుంచే దాడి చేస్తూ బౌండరీలు, సిక్సర్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించడం అతడి ప్రత్యేక శైలి.

బౌలర్ ఎవరు, పిచ్ ఎలా ఉందన్నది పట్టించుకోకుండా తన సహజ దూకుడు ఆటతో మ్యాచ్‌ను శీఘ్రంగా తనవైపు(IndVsPak) తిప్పే సామర్థ్యం అతడికి ఉంది.

పాకిస్థాన్‌తో(IndVsPak) కీలక మ్యాచ్‌లో కూడా అభిషేక్ అదే స్టైల్ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. పవర్‌ప్లే ముగిసే వరకు అతడు క్రీజులో నిలబడితే, భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రారంభంలోనే వేగంగా పరుగులు చేయడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించడమే అతడి ప్రధాన లక్ష్యం. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శనపై భారత అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడి దూకుడు ఆటే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించగల కీలక అంశంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

T20 World Cup 2026: నేడే భారత్-పాక్ మ్యాచ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha