PCB vs England Test :ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలకు ఉపక్రమించింది.
లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై, సిరీస్‌ను 0-2తో కోల్పోయిన వెంటనే, సిరీస్ మధ్యలోనే జట్టులో సమూల మార్పులు చేపట్టింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు, రెడ్-బాల్ కోచింగ్ సిబ్బందిపై పీసీబీ వేటు వేసింది.
Read Also :Hardik Pandya: టీమిండియాకు బిగ్ షాక్.. హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయం!

PCB vs England Test :7 మంది వేటు.. 7 మందికి చోటు: కోచింగ్ సిబ్బందిలోనూ భారీ మార్పులు
వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ ఆఘాతో పాటు అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, ముహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్‌లను పీసీబీ జట్టు నుంచి తొలగించింది. వీరి స్థానంలో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌లతో పాటు తొలిసారిగా అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్, రజావుల్లాలకు టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. రెడ్-బాల్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను బాధ్యతల నుంచి తప్పించారు. ఈ పర్యటన ముగిసే వరకు వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్లే నోఫ్కేలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆటగాళ్ల పేలవ ఫామ్, గాయాల వివాదాలే ఈ నిర్ణయాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది.

