Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంగ్లండ్‌పై శ్రీలంక రికార్డు విజయం

ఇంగ్లండ్‌పై శ్రీలంక రికార్డు విజయం

వార్త 1 day ago

ENG vs SL: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో (ODI Tri-Series 2026) శ్రీలంక జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మూడో మ్యాచ్‌లో లంక జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

ఇంగ్లాండ్ నిర్దేశించిన 430 పరుగుల మహా లక్ష్యాన్ని చివరి బంతి వరకు పోరాడి మరీ ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన రన్-ఛేజ్ కావడం విశేషం. అంతేకాకుండా శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం గమనార్హం.

హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ వృథా.. ఇంగ్లాండ్ భారీ స్కోర్

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ద్విశతకంతో చెలరేగిపోయాడు. కేవలం 116 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రూక్‌తో పాటు జో రూట్ (69), విల్ జాక్స్ (66), టామ్ బాంటన్ (50) అర్ధశతకాలతో రాణించారు. అయితే, ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసినప్పటికీ.. లంక బ్యాటర్ల వీరోచిత పోరాటం ముందు ఆ జట్టు విజయం నిలవలేదు.

పవన్, శనక, లియానగే విధ్వంసకర పోరాటం

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ కమిందు మెండిస్ (18), కెప్టెన్ కుశాల్ మెండిస్ (0) వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (97), యువ ఆటగాడు పవన్ రత్నాయకే (130 పరుగులు, 106 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

అవిష్కా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ దాసున్ షనక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పవన్, శనక వెనుదిరిగిన తర్వాత జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను జనిత్ లియానగే (27 బంతుల్లో అజేయంగా 61) భుజాన వేసుకున్నాడు.

చివరి ఓవర్ థ్రిల్.. లియానగే సిక్సర్‌తో చారిత్రత్మక విజయం

మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జోష్ టంగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో లంక విజయానికి కేవలం 8 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. తొలి బంతికి లియానగే సింగిల్ తీసి దునిత్ వెల్లలాగేకు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాతి బంతుల్లో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు తిరిగింది.

ఆ తర్వాత అషితా ఫెర్నాండో సింగిల్ తీసి మళ్లీ లియానగేకు స్ట్రైక్ ఇచ్చాడు. చివరి రెండు బంతుల్లో విజయానికి 6 పరుగులు కావల్సి ఉండగా.. జనిత్ లియానగే అద్భుతమైన సిక్సర్ బాది శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

తొలి టీ20.. భారత్ టార్గెట్ 226 పరుగులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha