Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి'ని విడుదల చేసిన వి-రిచ్

ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి'ని విడుదల చేసిన వి-రిచ్

వార్త 2 weeks ago

V-Rich : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్లీన్-లేబుల్ ఫుడ్ బ్రాండ్ 'వి-రిచ్' (V-Rich) ఆధునిక వంటగదుల కోసం ప్రత్యేకంగా 'ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి'ని మార్కెట్లోకి విడుదల చేసింది.

సమయాభావంతో ఇబ్బందిపడే ఉద్యోగులు, బిజీ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త ఉత్పత్తిని రూపొందించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వంటి 7 రకాల సహజసిద్ధమైన పోపు దినుసులను వేయించి ఈ నెయ్యిని తయారుచేస్తారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ లేదా రసాయన రుచులు లేకుండా రూపొందించిన ఈ ప్రొడక్ట్, పప్పు, కిచిడీ, ఉప్మా లేదా కూరల్లో ఒక్క చెంచా వేయగానే క్షణాల్లో ఇంట్లో వేసిన అచ్చమైన తాలింపు రుచిని, సువాసనను అందిస్తుంది.

ఆన్‌లైన్ మరియు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో:

ఈ నూతన ఆవిష్కరణ ద్వారా భారతీయ సంప్రదాయ వంటకాల రుచిని సులభంగా అందించడమే తమ లక్ష్యమని వి-రిచ్ ఫౌండర్ మరియు సీఈఓ యోగితా జాహ్నవి తెలిపారు. ఈ 250 మి.లీ జార్ ధర రూ. 449గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (www.vrich.in) మరియు అమెజాన్‌లలో దేశవ్యాప్తంగా లభిస్తుండగా, హైదరాబాద్‌లోని వినియోగదారులకు ‘బ్లింకిట్’ (Blinkit) యాప్ ద్వారా వేగంగా డెలివరీ పొందే వెసులుబాటు కల్పించారు. త్వరలోనే ఇతర మెట్రో నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha