Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్వ్యూ లో కోపంతో మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్

ఇంటర్వ్యూ లో కోపంతో మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్

వార్త 6 days ago

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు స్వభావంతో అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఎన్‌బీసీ' (NBC) కి చెందిన సీనియర్ యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌తో జరిగిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో ట్రంప్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు.

ఇంటర్వ్యూ సజావుగానే సాగుతున్న సమయంలో కాలిఫోర్నియా ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున ఎన్నికల అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఏవైనా పక్కా ఆధారాలు ఉన్నాయా అంటూ యాంకర్ వెల్కర్ పదేపదే ప్రశ్నించడంతో ట్రంప్ ఒక్కసారిగా సహనం కోల్పోయారు.

Read Also : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..12 మందికి గాయాలు!

 Trump security

‘మీట్ ది ప్రెస్’ వేదికగా రచ్చ: మీడియాపై తీవ్ర పదజాలంతో విసురు

యాంకర్ వేసిన ప్రశ్నలకు తీవ్రంగా స్పందించిన ట్రంప్ లైవ్ లోనే ఆమెపై విరుచుకుపడ్డారు. “నువ్వు ఒక స్టుపిడ్వి. ప్రస్తుతం మీ పత్రికా రంగం మొత్తం అవినీతిమయంగా మారింది. ఈ ‘మీట్ ది ప్రెస్’ (Meet the Press) కార్యక్రమం ఒక మోసపూరితమైనది” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా “ఇక చాలు, థాంక్యూ డార్లింగ్” అని వ్యంగ్యంగా అంటూ తన కాలర్‌కు ఉన్న మైక్‌ను విసిరి కింద పడేసి ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవర్తించిన తీరు, మీడియా స్వేచ్ఛపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరియు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారానికి దారితీశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha