Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటికి వెళ్లడం ఈసారి కష్టమే

ఇంటికి వెళ్లడం ఈసారి కష్టమే

వార్త 2 weeks ago

Dussehra trains:దసరా సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది.

చదువు ఉద్యోగాల నిమిత్తం నగరంలో నివసించే వేలాది మంది పండుగకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రెండు నెలల ముందే రిజర్వేషన్లు ప్రారంభమైనప్పటికీ, సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి నాంపల్లి లింగంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లలో సీట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనివల్ల సాధారణ ప్రయాణికులు టికెట్లు దొరక్క తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Read also: Hyderabad festive thefts: దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త

 Huge queues on trains to go home

చివరి నిమిషంలో కన్ఫర్మ్ కానీ రిజర్వేషన్లు

రైలు ప్రయాణం సులభంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎక్కువ మంది దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బస్సులతో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉండటం రద్దీ సమయాల్లోనూ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు కాబట్టి డిమాండ్ విపరీతంగా పెరిగింది. రిజర్వేషన్లు దక్కని వారు వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో సీట్లు దొరకకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Dussehra trains:ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ దసరా పండుగ కోసం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాలకు రీజియన్ల వారీగా బస్సులను కేటాయించగా, అత్యధికంగా కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నగర పరిధిలో కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే వారి కోరిక మేరకు బస్సు నేరుగా వారి వద్దకే వస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha