Dailyhunt
IPL నిబంధనల ఉల్లంఘనపై BCCI సీరియస్: ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. అడ్వైజరీ జారీ

IPL నిబంధనల ఉల్లంఘనపై BCCI సీరియస్: ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. అడ్వైజరీ జారీ

వార్త 2 days ago

BCCI Warning IPL 2026: ఐపీఎల్ జట్లు,ఆటగాళ్ల వెంట 'అనధికార వ్యక్తులు' తిరుగుతున్నారనే నివేదికలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా స్పందించారు.

బోర్డు ఈ విషయంలో చూస్తూ ఊరుకోబోదని, అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అనధికార వ్యక్తులు జట్టు సభ్యులతో కలిసి బస్సుల్లో ప్రయాణించడం, హోటల్ గదుల్లోకి అనుమతి లేకుండా రావడం వంటివి గమనించామని ఆయన తెలిపారు.మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ మైదానంలోకి అడుగుపెట్టడం నిబంధనల ఉల్లంఘనే అని బీసీసీఐ పేర్కొంది.

Read Also:IPL 2026 : నేడు లక్నో కు అగ్ని పరీక్ష..!!

రాజస్థాన్ రాయల్స్ వివాదాల ప్రస్తావన

గత నెలలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి జరిగిన కొన్ని ఘటనలను సైకియా గుర్తుచేశారు.గువాహటిలో మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో మొబైల్ వాడినందుకు టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు రూ. 1 లక్ష జరిమానా, హెచ్చరిక జారీ చేశారు.పంజాబ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (Vaping) తాగుతూ కనిపించిన విషయాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించింది.

 Devajit Saikia on IPL Violations

BCCI Warning IPL 2026: డగౌట్ పవిత్రత, కొత్త మార్గదర్శకాలు

జట్టు యజమానులు మరియు అధికారులు ఆటగాళ్ల కోసం కేటాయించిన పరిమిత ప్రదేశాల్లోకి (PMOA) రావడంపై సైకియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “డగౌట్ పవిత్రతను”, జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ అవకతవకలను అరికట్టేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి త్వరలోనే ఒక సలహా మార్గదర్శకాన్ని (Advisory) జారీ చేయనున్నాయి.ఇకపై ఎలాంటి ఉల్లంఘన జరిగినా, బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని సైకియా తేల్చిచెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha