Google AI Data Hub: విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకం మొదలైంది. గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్సాహపూరితమైన ప్రసంగం చేశారు.
విశాఖ అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vizag IT Development
గూగుల్ హబ్‌తో మారుతున్న ఎకో సిస్టమ్
విశాఖలో కేవలం ఒక డేటా సెంటర్ మాత్రమే రావడం లేదని, దీనివల్ల ఐటీ మరియు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ ఏర్పడబోతోందని లోకేష్ స్పష్టం చేశారు. “ఇది కేవలం ఒక భవనం కాదు, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుకు పునాది” అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క!
విశాఖ ప్రగతిపై ధీమా వ్యక్తం చేస్తూ.. “వైజాగ్ విషయంలో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క” అంటూ తనదైన శైలిలో మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో కంటే భిన్నంగా, అత్యంత వేగంగా విశాఖను గ్లోబల్ ఐటీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, సమతుల్య అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
Google AI Data Hub: వైజాగ్ గ్లోబల్ హబ్‌గా..
గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజం విశాఖకు రావడం వల్ల ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఏపీ వైపు చూస్తాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా చర్చ సాగింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

