Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ

ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ

వార్త 1 month ago

రాక్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే నేతలను కాదని, కొత్తగా ఎన్నికైన ఇరాక్ అధ్యక్షుడు నిజార్ అమేడే.. వ్యాపారవేత్త అలీ అల్-జైదీని దేశ ప్రధానమంత్రిగా నియమించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఇరాక్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాక్ ప్రధాని అభ్యర్థి ఎంపికలో అమెరికా జోక్యం ఈసారి స్పష్టంగా కనిపించింది. తొలుత ‘కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్’ కూటమి మాజీ ప్రధాని నూరి అల్-మాలికికి మద్దతు ఇచ్చింది. అయితే, ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్న మాలికిని ప్రధానిని చేస్తే ఇరాక్‌కు ఇచ్చే అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరింzచారు. అమెరికా ఆర్థిక సైనిక మద్దతును కోల్పోవడం ఇష్టం లేని ఇరాక్ నాయకులు, ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం తీవ్రంగా చర్చలు జరిపి చివరకు అలీ అల్-జైదీ పేరును ఖరారు చేశారు.

Read Also: Iran US Conflict : అణు చర్చలే అడ్డంకి… ఇరాన్-అమెరికా తగాదా

 Iraq New Prime Minister

Iraq New Prime Minister: చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు

ప్రస్తుతం నియమితులైన జైదీ గురించి రాజకీయంగా పెద్దగా తెలియదు, ఇది ఆయనకు ఒక సానుకూల అంశంగా మారింది. నేపథ్యం: ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకర్ టెలివిజన్ ఛానల్ యజమాని. ఇంతకుముందు ఆయన ఎలాంటి ప్రభుత్వ పదవులను చేపట్టలేదు. జైదీ వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఒకవేళ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సఫలమైతే, ఇరాక్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టిస్తారు. మీడియా ఆర్థిక రంగాల్లో ఆయనకున్న అనుభవం రాజకీయ నాయకులను, ప్రజలను ప్రభావితం చేయడానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ రాజకీయ వర్గాలను, తెగలను సంతృప్తి పరుస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఇటు అమెరికా, అటు ఇరాన్ మధ్య సంబంధాలను సమతుల్యం చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. నూరి అల్-మాలికి ప్రస్తుత తాత్కాలిక ప్రధాని మహమ్మద్ షియా అల్-సుదానీ తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవడం పట్ల రాజకీయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇరాక్ గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అంతర్గత ప్రాంతీయ వివాదాల నుండి బయటపడి కొంత స్థిరత్వం పొందే దిశగా ఈ నామినేషన్ ఒక కీలక అడుగుగా భావించబడుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వామ్మో ..తోటి సైనికులను చంపి తింటున్న రష్యా సైనికులు !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha