Dailyhunt
ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్

ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టు కిడ్నాప్

వార్త 2 weeks ago

American journalist kidnapped iraq : ఇరాక్‌లో అమెరికాకు చెందిన మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ కావడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాక్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం మరింత చర్చకు దారితీసింది. జర్నలిస్ట్‌ను బాగ్దాద్ నగర వీధుల్లో బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లినట్లు సమాచారం.

అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు

ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అతడికి ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే కతైబ్ హెజ్‌బొల్లా మిలిషియా బృందాలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఖతర్‌కు చెందిన ఒక మీడియా సంస్థ విడుదల చేయడం కూడా సంచలనంగా మారింది. వీడియో బయటకు రావడంతో ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

Read also: Unilever: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాలపై బ్రేక్

అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన

ఈ ఘటనను అంతర్జాతీయ మహిళా మీడియా (American journalist kidnapped iraq) ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. సంస్థ అధ్యక్షురాలు ఎలీసా లీస్ మునోజ్ స్పందిస్తూ షెల్లీ కిటెల్సన్ ధైర్యవంతురాలైన జర్నలిస్ట్ అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రాంతం నుంచి వార్తలను సేకరిస్తూ ఆమె పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం బాధాకరమని తెలిపారు. బాగ్దాద్ వీధుల్లో దుండగులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రేపటి నుండి భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha