పాకిస్తాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు వెళ్లడంతో, కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో అమెరికా రెండో విడత చర్చలు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు.
పాకిస్తాన్ ఆతిథ్యంలో, ఇస్లామాబాద్‌లో 20 గంటలకు పైగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసినా, రెండు వారాల కాల్పుల విరమణ ఇంకా అమల్లోనే ఉంది. చర్చలు విఫలమైన తర్వాత, ఇరాన్‌పై తమ కొత్త వ్యూహంగా అభివర్ణిస్తూ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో, అంతర్జాతీయ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి దిగ్భంధం గురించి వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు.
Read Also: Pakistan Nobel Prize: పాక్ నేతల నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదనపై విమర్శలు
Iran-America War
Iran-America War ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల దిశగా పయనిస్తున్నాయా?
అయితే, ఎలాంటి ఒప్పందం కుదరకుండానే మొదటి దశ చర్చలు విఫలం కావడం, మరోసారి చర్చలు జరిగే అవకాశముందా అనే విషయాలను ఎలా చూడాలి? ఇరాన్, అమెరికా పరిమిత ఉద్రిక్తతల దిశగా పయనిస్తున్నాయా? లేదంటే, విస్తృత స్థాయి యుద్ధానికి దిగబోతున్నాయా? కొద్దివారాల పాటు కొనసాగిన ఘర్షణల తర్వాత అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం.. పరిస్థితిని అదుపులోకి తేవడానికి, ఇరుపక్షాల సుముఖతకు సంకేతంగా కనిపించింది. కానీ, మొదటి నుంచి ఇందులో స్పష్టత లేని అంశాలు చాలానే ఉన్నాయి. దాని భౌగోళిక పరిధి, లక్ష్యాల తీరుతెన్నులు, “కాల్పుల విరమణ ఉల్లంఘన” నిర్వచనం వంటి నిబంధనల్లో భేదాభిప్రాయాలు ఈ ఒప్పందాన్ని ఒక పరిష్కార మార్గాన్ని చూపే స్థిరమైన వ్యవస్థగా కంటే, దీనిని ఒక వ్యూహాత్మక విరామంగానే పరిశీలకులు భావించేందుకు కారణమయ్యాయి.
ఇరుపక్షాల అధికారవర్గాల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు
“ఈ సంఘర్షణ మొదలైనప్పటి నుంచీ, ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యంగానే కనిపించాయి” అని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్ ‘ఫౌండేషన్ ఫర్ డెమొక్రసీస్’ సీనియర్ ఫెలో బెహ్నామ్ బెన్ టలేబ్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇరుపక్షాల అధికారవర్గాల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారులు పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనల గురించి ప్రస్తావిస్తుంటే.. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం తమ హామీల పరిమితుల గురించి మాట్లాడుతున్నాయి. మరోసారి చర్చల కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు కనుక ఫలించకపోతే.. ఈ కాల్పుల విరమణ కేవలం కాలయాపన కోసం, ఇరుపక్షాలు కాస్త విరామం తీసుకుని, తమను తాము పునరుద్ధరించుకుని, తిరిగి శక్తులను సమీకరించుకుని, తమ ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుని, ఘర్షణలో తదుపరి దశకు సిద్ధమయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ట్రంప్ షాకింగ్ ట్వీట్: ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య యుద్ధానికి విరామం!

