Dailyhunt
ఇరాన్ మిస్సైల్ దాడి.. అమెరికా అవాక్స్ విమానం ధ్వంసం

ఇరాన్ మిస్సైల్ దాడి.. అమెరికా అవాక్స్ విమానం ధ్వంసం

వార్త 3 weeks ago

E3 sentry awacs plane : పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు భారీ షాక్ తగిలినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

శత్రువుల కదలికలను పసిగట్టి సైన్యానికి సమాచారం అందించే కీలక గగనతల నిఘా విమానం ఈ-3 సెంట్రీ అవాక్స్‌ను ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లతో ధ్వంసం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ విమానం ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో దాడి జరిగినట్లు సమాచారం. రియాద్‌కు దక్షిణంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ మిస్సైల్ ఈ విమానాన్ని లక్ష్యంగా చేసుకుందని కథనాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో 10 నుంచి 12 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడిని అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ-3 సెంట్రీ అవాక్స్ అంటే ఏమిటి?

ఈ-3 సెంట్రీ అవాక్స్ యుద్ధ సమయంలో అమెరికా సైన్యానికి అత్యంత కీలకమైన గగనతల నిఘా విమానం. ఇది వందల మైళ్ల పరిధిలో గగనతలాన్ని పర్యవేక్షించగలదు. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ముందుగానే గుర్తించి మిత్ర దేశాల దళాలకు హెచ్చరికలు పంపుతుంది.

ఈ విమానం సాధారణంగా పెద్ద రాడార్ డోమ్‌తో ఉండి గగనతలంలో ఎయిర్‌బోర్న్ కమాండ్ సెంటర్‌లా పనిచేస్తుంది. మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ వెనబుల్ ప్రకారం, ఈ విమానం ధ్వంసం కావడం గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నిఘా సామర్థ్యానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

Read Also: Amilineni Surendra Babu: కళ్యాణదుర్గంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

భారీ నష్టం ఎదుర్కొన్న అమెరికా

ఈ యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు (E3 sentry awacs plane) నివేదికలు చెబుతున్నాయి. కనీసం 17 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. ఇందులో ఎఫ్-35 లైట్నింగ్-2, ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని కథనాలు పేర్కొంటున్నాయి.

ఒక్క ఎఫ్-35 లైట్నింగ్-2 ధర సుమారు 80 నుంచి 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ ధర సుమారు 60 మిలియన్ డాలర్లు. ఇక ఈ-3 సెంట్రీ అవాక్స్ అప్‌గ్రేడ్‌లతో కలిపి దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో అమెరికాకు 18 నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగి ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గ్యాస్ సిలిండర్ రాలేదని ఫినాయిల్ తాగిన మహిళ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha