Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ పై మేం మళ్లీ దాడి చేయొచ్చు - ట్రంప్

ఇరాన్ పై మేం మళ్లీ దాడి చేయొచ్చు - ట్రంప్

వార్త 9 hrs ago

Trump Warning : ఇరాన్‌పై అమెరికా మళ్లీ మిలిటరీ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..

గతంలో చేపట్టిన చర్యల తరహాలోనే ఇరాన్‌పై “మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ (Epic Fury) దాడికి” దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ సైనిక చర్య ఎప్పుడు, ఏ రూపంలో ఉంటుందనేది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలు, ప్రాంతీయ వ్యూహాలపై దిగిరాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడమే కాకుండా, తాము ఒప్పందానికి కూడా సిద్ధంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఈ వారంలోనే దాడి? - రాయబారి వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

ట్రంప్ వ్యాఖ్యలకు ముందే తుర్కియేలో అమెరికా రాయబారి టామ్ బర్రాక్ చేసిన ప్రకటనలు ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళన రేకెత్తించాయి. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై అమెరికా దాడి జరిగే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. అదే సమయంలో డిప్లమాటిక్ మార్గాల్లో సమస్య పరిష్కారానికి డీల్ చేసుకునేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని కూడా వివరించారు. అమెరికా రాయబారి మరియు అధ్యక్షుడి వరుస హెచ్చరికలతో పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి, ఇది అంతర్జాతీయ చమురు మార్కెట్లు, గ్లోబల్ సెక్యూరిటీపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

టిబెట్‌లో 7.0 తీవ్రతతో భూకంపం: భయాందోళనల వీడియోలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha