Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ పై ట్రంప్ అటాక్ కు ప్లాన్ చేసాడు కానీ ..!!

ఇరాన్ పై ట్రంప్ అటాక్ కు ప్లాన్ చేసాడు కానీ ..!!

వార్త 3 months ago

ప్రపంచ దేశాలను మరోసారి యుద్ధ భయం వణికించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై రేపే (బుధవారం) భారీ స్థాయిలో సైనిక దాడులు (Air Strikes) జరుపుటకు అమెరికా పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

అమెరికా వ్యూహాత్మక దాడులకు సర్వం సిద్ధమైన తరుణంలో.. గల్ఫ్ దేశాల అత్యవసర జోక్యంతో ఈ ప్రమాదం తాత్కాలికంగా తప్పింది. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాధినేతలు ట్రంప్‌తో అత్యవసరంగా మాట్లాడి, దాడులు చేయవద్దని గట్టిగా అభ్యర్థించడంతోనే తాను ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Read Also : ముగిసిన రష్యా చమురు ఆంక్షల మినహాయింపు గడువు.. సామాన్యుడి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్.. సైన్యానికి కీలక ఆదేశాలు

ఈ హైడ్రామాకు సంబంధించిన వివరాలను డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' (Truth Social) ద్వారా పంచుకున్నారు. గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థనను మన్నించి, ఇరాన్‌పై దాడులు నిర్వహించవద్దంటూ అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ (రక్షణ మంత్రి) పీట్ హెగ్సెత్, మరియు మిలిటరీ జనరల్స్‌ను ఆదేశించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక బలగాలు ఇప్పటికే దాడికి వ్యూహాత్మకంగా మోహరించినప్పటికీ, దౌత్యపరమైన చర్చలకు చివరిగా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు వైట్ హౌస్ వర్గాల సమాచారం.

‘డీల్’ కుదరకపోతే భారీ విధ్వంసం తప్పదు!

దాడి ప్లాన్‌ను తాత్కాలికంగా విరమించుకున్నప్పటికీ, ఇరాన్‌కు ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ప్రతిపాదించిన దౌత్యపరమైన ఒప్పందానికి (Deal) ఇరాన్ గనుక అంగీకరించకపోతే.. మున్ముందు ఊహించని స్థాయిలో భారీ విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ అణు రక్షణ వ్యవస్థలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియా (Middle East) లో మునుపెన్నడూ లేనంతగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆ కుర్చీ వెనుక అమెరికా హస్తం? ఇమ్రాన్ ఖాన్ పతనంపై 'సైఫర్' రేపిన సంచలనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha