Trump on Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం రేపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ పదవి నుంచి అమెరికా సైనిక విజయం వరకు ట్రంప్ చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
Read Also: Iran-USA War: భారీ దాడులు చేస్తామంటున్న ట్రంప్..ఇరాన్ సమాధానం ఇదే
Trump on Iran: సుప్రీం లీడర్ పదవిపై ప్రతిపాదన
అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా తనను బాధ్యతలు తీసుకోవాలని ఇరాన్ కోరిందని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ట్రంప్ తెలిపారు.అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. ఆ దేశ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు. ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్‌ను సైనిక విధ్వంసంగా అభివర్ణించి ట్రంప్.. యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని పునరుద్ఘాటించారు.
Donald Trump comments on Iran Supreme Leader
నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ కు అమెరికా 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళిక ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా ప్రపోజల్‌ను ఇరాన్ తిరస్కరించింది. కౌంటర్ గా ఇరాన్ కూడా రిటర్న్ కండిషన్స్ పెట్టింది. అమెరికా తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

