Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ తర్వాత క్యూబానే టార్గెట్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ తర్వాత క్యూబానే టార్గెట్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వార్త 1 month ago

Donald Trump on Cuba: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను "స్నేహపూర్వక స్వాధీనం" చేసుకుంటామని వెల్లడించారు.

ఈ మేరకు క్యూబా ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇరాన్ నుండి తిరిగొచ్చే క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'ను క్యూబా తీరానికి పంపి లొంగిపోయేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read Also:OPEC Alliance: ఒపెక్ కూటమికి యూఏఈ గుడ్ బై: చమురు రాజకీయాల్లో పెను మార్పులు

క్యూబాలోని ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ.. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే తాను ఒకేసారి అనేక రంగాల్లో పోరాడటానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి పెద్ద సంఘర్షణ లేకుండానే క్యూబాను లొంగదీసుకోగలదని అన్నారు. ''మేము ఇరాన్ నుంచి వైదొలగినప్పుడు.. క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ను, మేము నిలిపివేస్తాం.'' అని అన్నారు. అమెరికా యుద్ధనౌకను చూడటమే చాలు. ఆయన ఇంకా చమత్కరిస్తూ.. ''వారు (క్యూబన్లు) దాన్ని చూసి.. ''మీకు చాలా ధన్యవాదాలు.మేము లొంగిపోతున్నాం.'' అని చెబుతారని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Donald Trump on Cuba: అవినీతి, ఉగ్రవాదంపై పోరు

అలాగే, క్యూబా ప్రభుత్వం వల్ల అమెరికా జాతీయ భద్రతకు "అసాధారణమైన ముప్పు" పొంచి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. కమ్యూనిస్ట్ క్యూబా పాలన, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం,ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. కొత్తగా విధించిన ఆంక్షలు క్యూబా భద్రతా యంత్రాంగానికి మద్దతు ఇచ్చే వ్యక్తులను, అవినీతికి పాల్పడే అధికారులను ,మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిని లక్ష్యంగా చేసుకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూ కీ తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha