Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ తో యుద్ధం.. 17 మంది అమెరికా సైనికుల మృతి

ఇరాన్ తో యుద్ధం.. 17 మంది అమెరికా సైనికుల మృతి

వార్త 2 weeks ago

US- Iran War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

తాజాగా ఇరాక్‌లో కూలిపోయిన ఒక ఇరానియన్ డ్రోన్‌ను నిర్వీర్యం (డిటోనేట్) చేయడానికి ప్రయత్నిస్తుండగా అది తీవ్రస్థాయిలో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక అమెరికా సైనికుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని 'యూఎస్ సెంట్రల్ కమాండ్' అధికారికంగా ధృవీకరించింది. దీనికి కొద్దిరోజుల ముందే జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ జరిపిన భీకర డ్రోన్ దాడుల్లో ఇద్దరు యూఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ సైనికుల సంఖ్య 17కు చేరుకుంది.

ప్రతీకార దాడులతో రగిలిపోతున్న మిడిల్ ఈస్ట్: అమెరికా వరుస వైమానిక దాడులు

తన సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా యూఎస్ వరుసగా 8వ రాత్రి కూడా శక్తివంతమైన వైమానిక దాడులను కొనసాగించింది. ఇరాక్, జోర్డాన్ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు ఉన్న ముఠాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అమెరికా, భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో సాగుతున్న ఈ ప్రతీకార దాడులు మిడిల్ ఈస్ట్‌లో పూర్తి స్థాయి మహా యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ సంతకం 'విలువలేనిది' అని ఒప్పందాన్ని రద్దు చేసిన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha