ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధ జ్వాలల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ విషయంలో అమెరికా , ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వినాశనానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. పర్షియన్ నాగరికత యొక్క లోతైన చరిత్రను, వారి ప్రతిఘటన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా అమెరికా ముందడుగు వేయడం పెద్ద పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. 1953 కుట్రను గుర్తు చేసిన సాచ్స్ ఇరాన్ నేడు అమెరికాను ఇంతలా ఎందుకు వ్యతిరేకిస్తోందో సాచ్స్ వివరించారు. 1953లో సీఐఏ (CIA) మద్దతుతో ఇరాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ తమకు అనుకూలమైన పాలనను తెచ్చిన చరిత్రను అమెరికా మర్చిపోకూడదని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి అమెరికా జోక్యం పట్ల ఇరాన్‌లో గూడుకట్టుకున్న నిరసన నేడు తీవ్ర ప్రతిఘటనగా మారిందని, వాషింగ్టన్ పాత తప్పులనే మళ్లీ పునరావృతం చేస్తూ ప్రపంచాన్ని ప్రమాదకరమైన ఘర్షణ వైపు నెడుతోందని ఆయన విమర్శించారు.
Read Also: Iran-America War: "మనం ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తున్నాం": ట్రంప్ అల్టిమేటం
Iran-USA War
Iran-USA War: ఇరాన్ పవర్ ప్లాంట్లు , వంతెనలపై దాడుల హెచ్చరికలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) ఇటీవల ఇరాన్ పవర్ ప్లాంట్లు , వంతెనలపై దాడులు చేస్తామని ఇచ్చిన హెచ్చరికలు కేవలం యుద్ధానికి దారితీయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తాయని సాచ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఏ దేశం కూడా నిజమైన విజేతగా నిలవదని, అన్ని వైపులా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటే అది గ్లోబల్ ఎకానమీపై తీరని దెబ్బ తీస్తుందని ఆయన హెచ్చరించారు. నాటో వైఫల్యం , యూరప్ మౌనం ఈ సంక్షోభ సమయంలో నాటో (NATO) ప్రాసంగికతను కూడా సాచ్స్ ప్రశ్నించారు. ఐరోపా దేశాలు మౌనంగా ఉండటం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోందని, అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వత్తాసు పలకడం వల్ల ఐరోపా కూడా నష్టపోక తప్పదని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మరో భారీ యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని ఆయన సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

