Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్‌లో ఇద్దరు మొసాద్ ఏజెంట్లకు ఉరిశిక్ష!

ఇరాన్‌లో ఇద్దరు మొసాద్ ఏజెంట్లకు ఉరిశిక్ష!

వార్త 1 month ago

Iran: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం పనిచేశారన్న ఆరోపణలతో ఇరాన్ శనివారం ఇద్దరు వ్యక్తులను ఉరితీసింది. యాకూబ్ కరీంపూర్, నాసర్ బెకర్జాదే అనే ఈ ఇద్దరికీ సుప్రీం కోర్టు మరణశిక్షను ఖరారు చేయడంతో, న్యాయ ప్రక్రియల అనంతరం శిక్షను అమలు చేసినట్టు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

Read Also:Trump vs Iran: ఇరాన్ అణ్వాయుధ కలలను తుడిచిపెట్టాం..ఫ్లోరిడా వేదికగా ట్రంప్ గర్జన

Iran: నిందితులపై ఉన్న ఆరోపణలు ఇవే..

యాకూబ్ కరీంపూర్: అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన 40 రోజుల యుద్ధ సమయంలో మొసాద్‌కు చురుకుగా సహకరించాడు. దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని టెలిగ్రామ్ ద్వారా చేరవేయడంతో పాటు, సైనిక స్థావరాల వద్ద పేలుళ్లు జరపడం, వాటిని చిత్రీకరించడం వంటి పనులకు డబ్బులు తీసుకున్నాడు.

 Iran Execution News, Mossad Agents Executed

నాసర్ బెకర్జాదే: ఇరాన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, మత పెద్దలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వాట్సాప్ మరియు ఈమెయిల్ ద్వారా మొసాద్‌కు అందించాడు. దీనికి ప్రతిఫలంగా ఇతను కూడా పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించినట్లు నిర్ధారణ అయింది.

కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరిని ఉరితీయడం ఇది రెండోసారి. ఏప్రిల్ 20న కూడా మరో ఇద్దరు వ్యక్తులకు కూడా గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఉరిశిక్షను అమలు చేశారు. వీళ్లు ఇరాక్‌తో సహా విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొని, ఇరాన్‌లో గూఢచర్యం చేస్తూ ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్: 400 ఏళ్ల తర్వాత బెర్ముడా గడ్డపై బ్రిటీష్ రాజు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha