Iran Internet: ఇరాన్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే స్వల్ప స్థాయిలో ఇంటర్నెట్ యాక్సెస్‌లోకి వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు.
బుధవారమే ప్రభుత్వం మళ్లీ సేవల్ని ప్రారంభించింది. కానీ నెట్ చాలా స్లోగా వస్తోంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాధి నేతలకు వ్యతిరేకంగా జనవరిలో ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో ఇంటర్నెట్‌పై ఆంక్షలు పెట్టారు. ఇక ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన తర్వాత ఇరాన్‌లో ఇంటర్నెట్ పూర్తిగా బ్లాకౌట్ అయ్యింది.
Read Also : America-Iran War: సమీపంలోనే అమెరికా-ఇరాన్ ఒప్పందం..కానీ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే: వాన్స్
Iran Internet
Iran Internet: ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు
ఇంటర్నెట్ ట్రాకింగ్ కంపెనీ నెట్‌బ్లాక్స్ దీనిపై రిపోర్టును రిలీజ్ చేసింది. షట్‌డౌన్ కన్నా ముందు ఉన్ననాటి పరిస్థితులతో పోలిస్తే 86 శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నెట్‌బ్లాక్స్ తెలిపింది. ఇక ఇంటర్నెట్ ట్రాఫిక్ సుమారు 40 శాతం ఉన్నట్లు కెంటిక్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఉన్నాయని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Iran Internet
ఇంటర్నెట్‌ను పాక్షికంగా
బ్లాక్ చేసిన సైట్లను వీక్షించేందుకు ఇరానీలు ఎక్కువగా వీపీఎన్‌పై ఆధారపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ నిషేధం వల్ల దేశంలో ఆన్‌లైన్ వ్యాపారం దెబ్బతిన్నది. నిరసనలు, యుద్ధం సమయంలో ఇరానీ కుటుంబాలు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఇబ్బందిపడ్డాయి. అయితే అమెరికాతో శాంతి డీల్ కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్‌ను పాక్షికంగా పునరుద్దరించినట్లు తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
సీఐఏకు భారీ కన్నం: మాజీ అధికారి ఇంట్లో రూ.382 కోట్ల బంగారం, మిలియన్ల కొద్దీ నగదు!

