Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వార్త 3 weeks ago

Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి'. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read Also : Yellamma Movie Heroine: 'ఎల్లమ్మ'లో హీరోయిన్‌గా అనంతిక సనిల్‌కుమార్ ఫిక్స్!

 'Irumudi' OTT release date fixed… Here's when it starts streaming.

Irumudi Movie: సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్!

తాజా సమాచారం ప్రకారం 'ఇరుముడి' సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే మాస్ మహారాజా అభిమానులు ఇప్పుడు ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఓటీటీలో వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, స్వాసిక తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు.

‘ఇరుముడి’ కథాంశం

త్రినాథ్ (రవితేజ) సీలేరు ప్రాంతంలోని పోలూరు అనే పల్లెటూర్లో ట్రక్ ఆటో నడుపుకుంటూ, రెండు ఎకరాల తోటలో అరటి వ్యవసాయం చేసుకునే ఒక సామాన్య వ్యక్తి. తన కుమార్తె మణికంఠ అలియాస్ మణెమ్మే (నక్షత్ర) తన లోకంగా బతుకుతుంటాడు. ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉండటంతో, పాపను దూర ప్రాంతాలకు పంపలేక స్కూల్ మాన్పించేందుకు కూడా వెనుకాడని ప్రేమాస్పదుడైన తండ్రి ఆయన.

అనునిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న త్రినాథ్, కార్తీక మాసంలో మాత్రం 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో అయ్యప్ప మాల ధరిస్తాడు. తన కుమార్తెను చల్లగా చూడాలని స్వామిని ప్రార్థిస్తూ, ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా తన సొంత బిడ్డలా భావించి అడ్డునిలబడతాడు. ఈ క్రమంలో తమ గురుస్వామి (సాయికుమార్) కుమార్తె గాయత్రి ఒకరోజు అనుకోకుండా మాయమవుతుంది. అసలు గాయత్రికి ఏమైంది? ఆ ఊరిని వెంటాడుతున్న సమస్య ఏమిటి? త్రినాథ్ ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే 'ఇరుముడి' చిత్ర కథాంశం. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ చిత్రం ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

'ప్యారడైజ్' నుంచి 'యేష నాగుల' రెండో సాంగ్ వచ్చేసింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha