Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇరుముడి'పై దిల్ రాజు ప్రశంసలు.. రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు

'ఇరుముడి'పై దిల్ రాజు ప్రశంసలు.. రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 3 weeks ago

Dil Raju: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' ఘన విజయం సాధించడంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం జరిగిన 'కూర్మ అవతార్' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, ఈ చిత్రం సాధించిన సక్సెస్ కేవలం యూనిట్‌కు మాత్రమే కాకుండా మొత్తం టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రశంసించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు.

బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న చిత్రం

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, రూ. 200 కోట్ల మైలురాయి వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 7 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇక ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతూ, ఒక్క ఉత్తర అమెరికాలోనే 1.25 లక్షల టికెట్ల విక్రయాలతో 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.

Dil Raju: థియేటర్ల మార్పు వివాదం మరియు 'ఇరుముడి'కి మళ్లీ దక్కిన ప్రాధాన్యత

ఇదిలాఉంటే, ఇటీవల కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'టాక్సిక్' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద జోరు మీదున్న 'ఇరుముడి' చిత్రానికి సంబంధించిన కొన్ని థియేటర్లను తొలగించి 'టాక్సిక్'కు కేటాయించడంపై సోషల్ మీడియాలో కొంత చర్చ, విమర్శలు చెలరేగాయి. అయితే, 'టాక్సిక్' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, థియేటర్ల నిర్వాహకులు తిరిగి 'ఇరుముడి' చిత్రానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రదర్శనలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

'కేజేక్యూ : కింగ్ జాకీ క్వీన్'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha