Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇస్రో ఉద్యోగాన్ని వదిలి ఫ్యాన్ బిజినెస్

ఇస్రో ఉద్యోగాన్ని వదిలి ఫ్యాన్ బిజినెస్

వార్త 0 months ago

Manoj Meena: ప్రతిష్టాత్మక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వస్తే ఎవరైనా ఎగిరి గంతేసి చేరుతారు. కానీ, ఐఐటీ బాంబే ( IIT Bombay) పూర్వ విద్యార్థి మనోజ్ మీనా మాత్రం ఆ సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్‌ను ధైర్యంగా కాదనుకున్నారు.

సమాజంలో ఉన్న సమస్యలను సాంకేతికతతో పరిష్కరిస్తూ సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ప్రయాణం.. నేడు రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను దాటిన ప్రముఖ హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్ ‘ఆటంబర్గ్ టెక్నాలజీస్’ (Atomberg Technologies) రూపంలో దేశవ్యాప్తంగా నిలిచింది.

నాలగేళ్ల అన్వేషణ - బీఎల్‌డీసీ (BLDC) ఫ్యాన్ల విప్లవం

ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, అనువైన స్టార్టప్ ఐడియా కోసం మనోజ్ దాదాపు నాలుగేళ్లు నిరంతరం అన్వేషించారు. ఈ క్రమంలో 2012లో తన సహ విద్యార్థి శిబబ్రత దాస్‌తో కలిసి ‘ఆటంబర్గ్ టెక్నాలజీస్’ను ప్రారంభించారు. మార్కెట్లో ఉన్న సాధారణ సీలింగ్ ఫ్యాన్లు 75 నుంచి 80 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుండటాన్ని గమనించిన వీరు, బ్రష్‌లెస్ డీసీ (BLDC) మోటార్ టెక్నాలజీతో కేవలం 28 వాట్లతోనే పనిచేసే వినూత్న ఫ్యాన్లను అభివృద్ధి చేశారు. తొలుత 'గొరిల్లా' బ్రాండ్ పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసి, విద్యుత్ ఆదా చేయడంలో సంచలనం సృష్టించారు.

Manoj Meena: విస్తరణ నుంచి ఐపీవో (IPO) బాట వరకు

సీలింగ్ ఫ్యాన్ల విజయంతో ఊపందుకున్న ఆటంబర్గ్ సంస్థ క్రమంగా మిక్సర్-గ్రైండర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, స్మార్ట్ లాక్స్, జ్యూసర్లు వంటి ఇతర గృహోపకరణాల తయారీలోకి విస్తరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం దాదాపు రూ. 958 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 1,000 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించింది. వ్యాపార విస్తరణలో భాగంగా పబ్లిక్ ఇష్యూ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI)కి డ్రాఫ్ట్ పత్రాలను (DRHP) సైతం సమర్పించింది. మనోజ్ మీనా, శిబబ్రత దాస్‌ల అద్భుతమైన వ్యాపార దార్శనికతకు గుర్తింపుగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కింది. వినూత్న ఆవిష్కరణలతో ఎంతటి విజయాన్ని సాధించవచ్చో వీరి సక్సెస్ స్టోరీ భారతీయ యువతకు బలమైన స్ఫూర్తినిస్తోంది

పతంజలిలో అమ్మేది నకిలీ నెయ్యి:బ్రిజ్ భూషణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha