Jonnagiri Sand Mining:త్వరలోనే సిఎం చేతుల మీదుగా 'జొన్నగిరి గోల్డ్మెన్' ప్రారంభం రూ.50వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన 'బీచ్ సాండ్ పాలసీ' రాష్ట్ర మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి.
గత వైసిపి ప్రభుత్వ అనాలోచిత, అడ్డగోలు నిర్ణయాల వల్ల సర్వనాశనమైన రాష్ట్ర మైనింగ్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా తిరిగి పట్టాలెక్కించిందని రాష్ట్ర మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనా లోపాల వల్ల మైనింగ్ వృద్ధి రేటు 24నుంచి 7శాతానికి పడిపోయి, రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ.19,137 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో జరిగిన భారీ ఇసుక దోపిడిని తాము శాటిలైట్ డేటా ఆధారంగా సాంకేతికంగా నిరూపించామని, 5.08కోట్ల మేజర్ మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా తరలించినందుకు గాను రూ.3,891 కోట్ల రికవరీ డిమాండ్ నోటీసులు జారీ చేశామని ప్రకటించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్రంలో ఎసిబి కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ప్రస్తుతం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి లోతైన దర్యాప్తు జరుపుతోందని మంత్రి స్పష్టంచేశారు. 2023లో విపరీతమైన డిమాండ్ ఉన్న “సెలికా సాండ్” రంగాన్ని దౌర్జన్యంగా లాక్కొని పారదర్శక ఆన్లైన్ ఐడీలను బ్లాక్ చేసి కేవలం 20లీజులను “వామనా ఎంటర్ప్రైజెస్” అనే సిండికేట్కు కట్టబెట్టడం వల్లే రాష్ట్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని మంత్రి మండిపడ్డారు.
ED Probe into Sand Loot: A Gold Mine of Information
Jonnagiri Sand Mining:ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంపై ఇడి పంజా
ఈ అక్రమాలకు పూర్తి చెక్ పెడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రజలపై భారం మోపే సేల్స్ రేట్, డిఎం.ఎఫ్. మెరిట్ ఫీజులను పూర్తిగా రద్దుచేసి విప్లవాత్మక “ఫ్రీ సాండ్. పాలసీ”ని విజయవంతంగా అమలు చేస్తుందని కొల్లు రవీంద్ర వివరించారు. 5 ప్రభుత్వ శాఖలతో కూడిన కలెక్టర్ టాస్క్ పోర్స్” నిరంతర పర్యవేక్షణ వల్ల మార్కెట్లో ఇసుక ధర 25 నుంచి 30శాతం వరకు తగ్గిందని ప్రజలు కేవలం తవ్వకం, రవాణా ఖర్చులు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. జులై 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,91,85,793 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేశామని, ప్రస్తుత వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ముందస్తుగా 238 స్టార్ యార్డుల్లో 64లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచామని స్పష్టంచేశారు. అక్రమ మైనింగ్కు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఐఐటి ధన్బాద్కు చెందిన ‘టచ్మిల్ ఫౌండేషన్’ తో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం చేసుకున్నామని, ఇకపై మైనింగ్ క్వారీలను డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా గగనతలం నుంచి నిరంతరం నిఘా పెడతామని మంత్రి వెల్లడించారు. కర్నూలు జిల్లా జొన్నగిరి (తుగ్గలి మండలం)లో జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక బంగారు గని ప్రాజెక్టును త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. దీనితో పాటు చిత్తూరు జిల్లా చిగురుకుంట పరిసర ప్రాంతాల్లో బంగారం, ఇనుము, మాంగనీస్ నిల్వలున్న 17కొత్త మేజర్ బ్లాకులను ఐడెంటిఫై చేశామని, కావలికుల ఏరియాలో 1000 హెక్టార్ల పరిధిలో జి-2 లెవల్ ఖనిజాన్వేషణకు ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు.
Epaper: epaper.vaartha.com

