Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇ-ట్వంటీ ఈక్విటీతో తంటా!

ఇ-ట్వంటీ ఈక్విటీతో తంటా!

వార్త 3 weeks ago

Vaartha editorial: ఇ-20 పెట్రోలు వినియోగంవల్ల వాహనాల మన్ని కలో గణనీయమైన మార్పులు, సమస్యలు ఉత్పన్నం కావని సమగ్ర అధ్యయనాల్లో గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా వాహన వినియోగదా రుల్లో సందేహాలు నివృత్తమౌతున్నట్లు లేదు.

అంతేకాదు పాతతరం వాహనాల్లో కూడా ఇంజిన్లో ఎలాంటి మార్పులు లేకుండానే ఇ-20 పెట్రోలు వాడుకోవచ్చనీ భరోసా ఇస్తోంది. ఈవిషయాలను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్య సభలో నిష్కర్షగా వివరించారు. వాహనంలోని లోహ, ప్లాస్టిక్ భాగాలకు నష్టం చేయదని చెబుతున్నారు. మరో తడబాటు. ఏమిటంటే 2005 ఏప్రిల్ 1 తర్వాత ప్రవేశ పెట్టిన 2016కు ముందు తయారైన బిఎస్-3 వాహ నాలకు రబ్బరుతో తయారైన కొన్ని విడిభాగాలు, గ్యాస్కెట్ల మార్చాల్సి వస్తుందని వారే పేర్కొన్నారు.

 E-20 Petrol

E-20 Petrol : సరికొత్త మార్పుగానే భావించాలి

‘నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తమ మాట నెగ్గించు కున్న కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమానికి మరో ఆయుధం దొరక్కూడదని కేంద్రప్రభుత్వం విస్త తంగా ఎత్తులు వేస్తోంది. ఈ అంశం మీద తలెత్తిన సందేహాలను తీర్చేందుకు తెహసీన్ పునావాలా నేతృత్వంలో ‘టీమ్ భారత్ -ఇ 20’ అమలును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది. ఈ బృందంతో కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పురి చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. ఇలాంటి చర్చలు ఒక ముందడుగే అయినా ఇరుపక్షాల వాదనల్లో ఎలాంటి మార్పు రాకపోవడం విశేషం. ఈసమావేశంలో టీమ్ భారత్ పెట్టిన షరతులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పాత వాహనాల కోసం ఇ-10 పెట్రో లుతోపాటు ప్యూర్ పెట్రోలు కూడా అందు బాటులో ఉం చాలని, ప్రస్తుతమున్న ఫ్యూర్ పెట్రోలు ధరకే కంటె 20 శాతం తక్కువ ధర ఈ పెట్రోల్ ఇవ్వా లని డిమాండ్ చేస్తోంది. ఇ-20 పెట్రోలు వాడకమనేది. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఇంధన విధానంలో సరికొత్త మార్పుగానే భావించాలి. అయితే దాని విని యోగంపై పలువురిలో రకరకాల సందేహాలుతలెత్తాయి. ఇథనాల్లో శక్తిసాంద్రత పెట్రోల్ కంటె తక్కువ కావడం తో పాత వాహనాల్లో మైలేజీ కొంత తగ్గే అవకాశం ఉందని వాహనదారుల అంచనా. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వంకూడా అంగీకరించింది.

ఇథనాల్ కలపడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా

ఇ-20 పెట్రోల్తో వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గొచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వివరిం చారు. దిగుమతి చేసుకునే ముడిచమురుమీద ఆధార పడటం తగ్గించాలని, రైతులకు ఇథనాల్ మార్కెటింగ్ ద్వారా ప్రయోజనం కల్పించాలని, కార్బన్ ఉ ద్గారాలను తగ్గించాలనే లక్ష్యా లతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇథనాల్ కలపడం వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. కాలుష్యం తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న, ధాన్యపు వ్యర్థాలవంటి వంటలకు డిమాండ్ పెరుగు తుంది. ఇంధన భద్రతకు ఇదే మూలమని కేంద్ర ప్రభుత్వం నమ్మింది. ఆచరించాలని చూస్తోంది. ఇథనాల్ ధర పెట్రోల్ కన్నా తక్కువకే లభ్యమవుతున్నప్పుడు వినియోగదారునికి భారత తగ్గలే దెందుకనే అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇంధన భద్రత, రైతుకు ఆదాయం, దిగు మతి వ్యయం అన్ని అంశాలలోనూ మేలైన ప్రయోజనా లున్నాయి. కాగా శాస్త్రీయ ఆధారాలతో ఇ-20 పెట్రోలు వలన ఒనగూరే ప్రయోజనాల విషయంలో వినియోగ దారుడు సంతృప్తి పడినప్పుడే పెట్రోలు నుంచి మరో ఇంధనానికి మారే అవకాశముంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇ-20 పెట్రోల్ వాడకంలో విజయవంతమైతే పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, గ్రామీణ ఆర్ధికవ్యవస్థ బలోపేతం జరుగుతుందన్న కేంద్రప్రభుత్వం లక్ష్యం నెరవేరినట్లే. అందుకే 2025- 26 నాటికే ఇ-20 ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం తో కేంద్రప్రభుత్వం ముంద డుగు వేస్తోంది.

 E-20 Petrol

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ఊతం

భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులు చేసుకుం టోంది. కొత్త అన్వేషణతో రూపొందిన పెట్రోలు కావడం వల్ల సాలీనా రూ.30వేల కోట్లు విదేశీమారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశముందని అంచనాలున్నాయి. కానీ ఆదిలోనే తలెత్తిన అనుమానా లతో ఇ-20 వాడకం పూర్తిస్థాయిలో వినియోగానికి ఏర్పాట్లు చేసుకోలేకపోతోం ది. దేశీయంగా ఇథనాల్ డిస్టిలరీల ఏర్పాటుతో పారిశ్రా మిక ప్రగతిసాధ్యమై గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇ- 20 ప్రభావాన్ని మదింపు చేసేవిషయం లో ఇథనాల్ ఉత్పత్తికి ఇప్పుడున్న వ్యవసాయ ఉత్పత్తులు సరిపోతాయి. బయో ఫ్యూయెల్ కంపెనీలకు మంచి ధర గిట్టుబాటవుతుంది. ఇది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ఊతం కాగలదు. ఇథనాల్ కాలినప్పుడు వచ్చే కార్బన్ ఉద్గారాలు బహుతక్కువే. ఇథనాల్ క్యాలరీ విలువ పెట్రోల్ కంటే తక్కువ. ఇథనాల్ వాడితే 6శాతం నుంచి 8శాతం వరకు తగ్గుతుందని ఆటోమొబైల్ నిపుణుల అంచనా. ఇథనాల్ తేమను పీల్చుకుంటుంది. కావున ఇంజిన్ తుప్పుపట్టే అవకాశంతో కాలం మన్నిక తగ్గుతుంది. ఇథనాల్ ఉత్పత్తికి నీరు కావాలి. ఒక లీటర్ ఇథనాల్క రెండువేల లీటర్ల తీరు వృథా అని నిపుణులు అంటు న్నారు. వాహన మైలేజీ తగ్గుతుంది. పైగా పశ్చిమా సియా యుద్ధ తరుణంలో పెట్రోలు ధర పెంచలేదంటే దానికి ఇథనాల్ మిశ్రమం తోడవడం వల్లనేనని కేంద్రం ప్రత్యేకంగా వివరిస్తోంది. కాగా కనుక ఈ-20 ధర సాధారణ పెట్రోల్ ధర తగ్గించగలిగితే ప్రభుత్వ విధానానికి వా హనదారులు జై కొడతారు. ఈ వివాదం ఎంత త్వరగా పరిష్కారమైతే అంత మంచిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నేడు తగ్గిన పసిడి ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha