Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాగ్రత్త.. ఫ్రీ ట్రయల్స్ తో మోసం.. క్యాన్సిల్ చేయకపోతే డబ్బులు కట్

జాగ్రత్త.. ఫ్రీ ట్రయల్స్ తో మోసం.. క్యాన్సిల్ చేయకపోతే డబ్బులు కట్

వార్త 3 weeks ago

UPI Auto Mandate: ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది యూజర్లు వివిధ యాప్‌లలో లభించే ఉచిత ఫ్రీ ట్రయల్స్ (Free Trials) సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు.

అయితే ఫ్రీ ట్రయల్ గడువు ముగిసిన తర్వాత ఆయా యాప్‌లకు సంబంధించిన ‘ఆటో మ్యాండేట్’ (Auto Mandate) లేదా ఆటో-పే డిసేబుల్ చేయడం మర్చిపోతున్నారు. ఇలా మ్యాండేట్‌ను రద్దు చేయకపోవడం వల్ల, మనం సదరు యాప్‌లను ఉపయోగించకపోయినా నిర్ణీత గడువు ముగియగానే బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయి.

Read Also : Flipkart Freedom Sale 2026: 'ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్'.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లుపై భారీ ఆఫర్లు!

 Beware.. Free trials are a scam.. If you don’t cancel, you’ll lose money.

UPI Auto Mandate: బ్యాంక్ పెనాల్టీలు, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం

ఆటో మ్యాండేట్ అమల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలా ఆటో పేమెంట్ ఫెయిల్ అయిన ప్రతిసారీ బ్యాంకులు పెనాల్టీలు లేదా ఛార్జీలు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇటువంటి వరుస ఫెయిల్యూర్స్ వల్ల మీ క్రెడిట్ స్కోర్ (Credit Score / CIBIL) కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలా రద్దు చేసుకోవాలి?

మీకు ఏదైనా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదని భావిస్తే, ఫ్రీ ట్రయల్ గడువు ముగిసేలోపే ముందస్తుగా చర్యలు తీసుకోవాలి:

  • మీరు ఉపయోగిస్తున్న యూపీఐ యాప్స్ (GPay, PhonePe, Paytm మొదలైనవి) లోని ‘Autopay’ లేదా ‘Mandates’ విభాగంలోకి వెళ్లాలి.
  • అక్కడ యాక్టివ్‌గా ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకుని ‘Cancel Autopay’ లేదా ‘Remove Mandate’ పై క్లిక్ చేయాలి.
  • లేదా మీ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా ఈ ఆటో పేమెంట్ ఆప్షన్‌ను వెంటనే రద్దు చేసుకోవచ్చు.

'జన నాయగన్' హిట్‌పై కావేరి నిరసనలు, థియేటర్లలో ప్రదర్శనలు రద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha