Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు.

Read also: Anitha vs Amaranth : 'మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం
అమర్ స్తంభం వద్ద శ్రద్ధాంజలి
స్మారక ప్రాంగణంలో అమర్ స్తంభం వద్ద పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛం సమర్పించి వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం త్యాగ్ చక్ర ప్రాంతాన్ని సందర్శించి, అమరవీరుల పేర్లు చెక్కిన గ్రానైట్ ఫలకాల వద్ద పుష్పాలు ఉంచి గౌరవ నివాళులు అర్పించారు.
Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల వీరులను ప్రత్యేకంగా స్మరణ
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత రాజ్ కుమార్, హవల్దార్ అరుణ్ కుమార్ తదితర వీర సైనికుల త్యాగాలను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. దేశ రక్షణ కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
యుద్ధ స్మారక విశిష్టతపై అధికారులు వివరణ
పర్యటన సందర్భంగా సైన్యానికి చెందిన కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ పవన్ కల్యాణ్‌కు జాతీయ యుద్ధ స్మారక చరిత్ర, ప్రాముఖ్యత గురించి వివరించారు. స్మారకంలో ఏర్పాటు చేసిన నాలుగు చక్రాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయక వీరగాథలను ఆయనకు తెలియజేశారు. దేశ సాయుధ దళాల త్యాగాల గురించి మరింత తెలుసుకోవడం, అమరవీరులకు నివాళులర్పించడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అనంతరం అక్కడి డిజిటల్ విజిటర్స్ బుక్‌లో తన అభిప్రాయాలను నమోదు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

