Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ పట్ల వివక్ష వల్లే కాంగ్రెస్ పతనం

జగన్ పట్ల వివక్ష వల్లే కాంగ్రెస్ పతనం

వార్త 3 months ago

Jeevan Reddy on Jagan: జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన విమర్శలు గుప్పించారు. పార్టీ వీడే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ తన స్వయంకృత అపరాధాల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిందని ఆయన ఆరోపించారు.

Read Also:TGPSC OTR Update : TGPSC OTR గడువు పొడిగింపు.. ఏప్రిల్ 10 వరకు ఛాన్స్

జగన్ పట్ల వివక్షే కాంగ్రెస్ పతనానికి పునాది

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. "నాడు జగన్ పట్ల కాంగ్రెస్ వివక్ష చూపింది, అందుకే ఆ పార్టీ ఏపీలో కనుమరుగైంది" అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను దూరం చేసుకోవడం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లిందని, ఆ వివక్ష ఫలితాన్ని పార్టీ ఇప్పటికీ అనుభవిస్తోందని ఎద్దేవా చేశారు.

 Jeevan Reddy says Congress ignored Jagan after YSR death

విభజన సమయంలో జగన్‌తో చర్చించి ఉంటే బాగుండేది

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పెద్దలు జగన్‌తో సంప్రదింపులు జరిపి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి వేరుగా ఉండేదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌ను కాంగ్రెస్ పెద్దలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆయనను కలుపుకుపోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha