Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ తీరు ఇంకా మారలేదు.. శవ రాజకీయాలు వదల్లేదు - TDP

జగన్ తీరు ఇంకా మారలేదు.. శవ రాజకీయాలు వదల్లేదు - TDP

వార్త 2 months ago

Vizag Steel Plant Accident : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించిన తీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

జగన్ పర్యటనను అధికార తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తూ విమర్శల వర్షం కురిపించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తీరు ఇంకా మారలేదని, విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన 'శవ రాజకీయాలు' చేయడం వదల్లేదని ట్విట్టర్ (X) వేదికగా ధ్వజమెత్తింది. “తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో మొదలైన నీ శవ రాజకీయం.. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితుల వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది” అంటూ టీడీపీ ఘాటుగా విమర్శించింది. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో జగన్ ప్రదర్శించిన వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డాయి.

Read Also : బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్

రూ.100 ఇచ్చి మహిళల చేత జేజేలు.. వీడియోను ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ!

బాధితుల పరామర్శ వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతున్నామంటూ టీడీపీ ఒక సంచలన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి, వారికి మేలు జరిగేలా చూడాల్సింది పోయి జగన్ తన స్వంత పబ్లిసిటీ కోసం పాకులాడారని ఆరోపించింది. పరామర్శ సభలో గుంపుగా కనిపించేందుకు మహిళలకు తలా వంద రూపాయలు (₹100) ఇచ్చి తరలించారని, వారితో జగన్‌కు అనుకూలంగా జేజేలు కొట్టించుకుంటూ రాజకీయం చేశారని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది. బాధితుల శవాలపై పేలాలు ఏరుకునేలా సాగుతున్న ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, తక్షణమే ఈ శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని టీడీపీ డిమాండ్ చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కంచర్ల శ్రీనివాసులు హత్య కేసులో 13 మందికి యావజ్జీవ జైలు శిక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha