Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌కు నైతిక విలువలు లేవు: సీఎం చంద్రబాబు

జగన్‌కు నైతిక విలువలు లేవు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి రాజకీయ విలువలే కాకుండా, కనీస కుటుంబ మరియు నైతిక విలువలు కూడా లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. సొంత మేనకోడలి వివాహ వేడుకకు బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇచ్చేందుకు నిరాకరించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఆస్తిలో చెల్లెలికి భాగం ఉన్నప్పటికీ, మేనకోడలి పెళ్లిని అడ్డుకుని 'కంస మామ'గా తయారయ్యారని మండిపడ్డారు.

Coal Shortage : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత

 Jagan lacks moral values: CM Chandrababu

CM Chandrababu: ఆస్తుల కోసం కన్నతల్లిని, చెల్లిని వేధిస్తున్నారు: చంద్రబాబు

ఆస్తుల కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వేధిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలు అర్థం చేసుకోవాలని హితవు పలకారు. రాజకీయ ముసుగులో ఉన్న ఆ వ్యక్తి నిరంతరం అసత్యాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, బెంగళూరు నుంచి వచ్చి 'హిట్ అండ్ రన్' తరహాలో ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లిపోతున్నారని ధ్వజమెత్తారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా జరుగుతోందని ఆ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకరే చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం హింస జరుగుతోందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. గతంలో తమ పాలనలో 24 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నాటి ఎన్నికల కమిషనర్‌నే బెదిరించి, ఆయన కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, 28 జిల్లాల్లో వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.

పులివెందులలో ఎన్నడూ ప్రజాస్వామ్యం లేదు

“రాజకీయాల్లో ఇలాంటి నేరస్థులను నేనెప్పుడూ చూడలేదు. క్రిమినల్స్‌ను రాజకీయాల్లోకి తెచ్చి నానా యాగీ చేస్తున్నారు” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఎన్నడూ ప్రజాస్వామ్యం లేదని, ఎదురు మాట్లాడిన వారి గొంతు నొక్కేశారని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చూసి ఫ్రస్టేషన్‌తో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వారి కుతంత్రాలతో రక్తపాతం సృష్టించే ప్రయత్నాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.

సీబీఐ, ఈడీ కేసులపై ఎద్దేవా

గొడ్డలి పార్టీ అధ్యక్షుడి చుట్టూ సీబీఐ, ఈడీ కేసులు, అక్రమాస్తులు, మద్యం కుంభకోణాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కారణంగా ఎంతోమంది అధికారులు, నేతలు జైలుకు వెళ్లారని తెలిపారు. సొంత బాబాయిని చంపి, ఆ నేరాన్ని చెల్లెలిపై నెట్టే ప్రయత్నం చేశారని, నిందితుడిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకున్న వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము కష్టపడుతుంటే, ఆయన మాత్రం విధ్వంసమే ధ్యేయంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

Epaper: epaper.vaartha.com

ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల పంపకంపై కూటమి మంతనాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha