Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌పై రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు.. రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని ఆరోపణ

జగన్‌పై రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు.. రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని ఆరోపణ

వార్త 3 weeks ago

Rammohan Naidu: గత వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్ కొనసాగించిన వినాశకర పాలనను భరించలేకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని మండిపడ్డారు.

అసెంబ్లీకి రాకుండా మీడియా ముందుకు వచ్చి విమర్శలు: రామ్మోహన్ నాయుడు ధ్వజం

ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడే సత్తా లేకనే జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ లబ్ధి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఎందుకు సభకు రావడం లేదని సూటిగా నిలదీశారు. తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన మాట్లాడుతున్నప్పటికీ, ఇప్పటివరకు తాము చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారాలు చూపలేకపోయారని విమర్శించారు.

Rammohan Naidu:

యువత భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలు: రామ్మోహన్ నాయుడు ఆరోపణ

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకూడదని, ఏ ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందకూడదనే దుర్బుద్ధితోనే జగన్ నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా విపక్షం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా నిలిచారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఆ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha