Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైపూర్ పారామెడికల్ పరీక్షలో పాస్ చేయించేందుకు రూ.5.5 లక్షల డీల్.. నలుగురు అరెస్ట్

జైపూర్ పారామెడికల్ పరీక్షలో పాస్ చేయించేందుకు రూ.5.5 లక్షల డీల్.. నలుగురు అరెస్ట్

వార్త 4 days ago

Jaipur paramedical exam scam: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో పారామెడికల్ పరీక్షల్లో భారీ అక్రమాలకు పాల్పడేందుకు జరిగిన ఒక దారుణమైన కుట్ర వెలుగులోకి వచ్చింది.

విద్యార్థులను అక్రమ మార్గాల్లో పాస్ చేయించేందుకు కాలేజీ యాజమాన్యమే రంగంలోకి దిగడం అక్కడి విద్యాశాఖలో తీవ్ర సంచలనం రేపింది. నమ్మకమైన సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు ఈ గుట్టురట్టు చేశారు.

Read Also : National Ambulance Service 2026: 'జాతీయ అంబులెన్స్ సేవ-2026' మార్గదర్శకాలు విడుదల!

 Rs 5.5 lakh deal to ensure exam pass; four arrested.

Jaipur paramedical exam scam: రూ.5.5 లక్షల భారీ డీల్.. అసలేం జరిగిందంటే?

ఝున్‌ఝును ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న 45 మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారు. ఎలాగైనా వారిని అక్రమ పద్ధతిలో పాస్ చేయించాలని కాలేజీ నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇందుకోసం పరీక్షా కేంద్రం సిబ్బందితో రూ.5.5 లక్షల భారీ మొత్తానికి ఒప్పందం (డీల్) కుదుర్చుకున్నారు. పరీక్షల సమయంలో పెద్ద ఎత్తున 'మాస్ కాపీయింగ్' కు పాల్పడేలా ముందస్తు ప్రణాళిక రచించారు.

నలుగురు నిందితుల అరెస్ట్

ఈ అక్రమ వ్యవహారంపై ముందస్తు సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు తక్షణమే స్పందించి దాడులు చేపట్టారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతూ, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్రింది వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు పారామెడికల్ కాలేజీ నిర్వాహకుడు (యాజమాన్యం), కళాశాల విభాగాధిపతి (HOD), ముఖ్య లెక్చరర్ఈ, కుట్రకు సహకరించిన మరో ఉన్నతాధికారి పరీక్షల పవిత్రతను దెబ్బతీస్తూ, అర్హత లేని విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పాస్ చేయించేందుకు యత్నించిన ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మరికొంతమంది పరీక్షా కేంద్రాల సిబ్బందిని సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha