Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైపూర్‌లో ఉగాండా మహిళకు ఎబోలా వైరస్ !

జైపూర్‌లో ఉగాండా మహిళకు ఎబోలా వైరస్ !

వార్త 2 months ago

Ebola Virus: ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న ఉగాండా మహిళ రాజస్థాన్ చేరుకున్నది. ఆ మహిళను జైపూర్ ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆమె ఎబోలా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది.

దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను తక్షణమే నగరంలో ఆర్‌యూహెచ్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. షార్జా నుంచి ఆమె శుక్రవారం జైపూర్ చేరుకున్నది. కఠినమైన ఐసోలేషన్‌లో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఆ మహిళ నుంచి శ్యాంపిళ్లను సేకరించి.. తదుపరి విశ్లేషణ కోసం పుణె ల్యాబ్‌కు పంపారు.

Read Also : Text Claw : యువతలో వేగంగా పెరుగుతున్న టెక్ట్స్ క్లా సమస్య..

 Ebola Virus

Ebola Virus: ప్రయాణాలను రద్దు చేసుకోవాలి

ప్రమాదకర ఎబోలా వైరస్‌తో పోలిన లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే ఆమెలో ఎబోలా ఇంకా నిర్ధారణ కాలేదని రాజస్థాన్ వైద్య కళాశాల సూపరిండెంట్ అనిల్ గుప్తా తెలిపారు. రిపోర్టు అందిన తర్వాతే ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ జరుగుతుందన్నారు. అయితే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఓ సుడాన్ వ్యక్తిని కూడా ఎబోలా అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతర్జాతీయ ప్రయాణికులు నిర్వహిస్తున్న థర్మల్ స్క్రీనింగ్‌లో ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నెల రోజులు టీ తాగడం మానేస్తే ఎం జరుగుతుందో తెలుసా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha