Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జల'సంధి'కి రాజెవరో తేలేదాకా..?

జల'సంధి'కి రాజెవరో తేలేదాకా..?

వార్త 4 days ago

Hormuz : ఎవరూ వెనక్కి తగ్గలేదు. యుద్ధ సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లుంటాయి. దేశాధినేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడి సమస్యల్ని జరిలం చేసుకునే పరిస్థితి ఒక లాగుంటుంది.

మొన్నామధ్య పశ్చిమాసియా యుద్ధ మేఘాలకు విరామమేర్పడిందని సందేశం వినిపిస్తే అన్ని దేశాల వారూ సంబరపడిపోయారు. అప్పటికప్పు డు వచ్చే ప్రయోజనమేదీ లేకున్నా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ‘హర్మూజ్’ చట్రంలో బిగుసుకుపోయే సరికి గిల గిల్లాడి కొట్టుకున్నారు. పశ్చిమాసియా యుద్ధ వైఖరి ఎలా గుందంటే ఒక అడుగు ముందుకేస్తే రెండ డుగులు వెనక్కి అన్న చందాన సాగుతోంది. ఏవి తొలి చర్చలో ఏవి మలి చర్చలో, తుది చర్చలకు దారి ఏర్ప డ్తుందా? అవి అమలువుతాయా అన్న సందేహాల మధ్య ఇరాన్అమెరికా అధికార బృందాలు చర్చలు సాగాయి. అంతా అయిపోయి వచ్చే ఆరు నెలల్లో కికు రుమనకుండా స్నేహాభిలాషతో కలిసిమెలసి తుదినిర్ణయం తీసుకోవాలని ఉభయ వర్గా లూ అంగీకరించాయి. అడపాదడపా జనం ఊహకందని హెచ్చరికలతో బెదరకొట్టి ఊదరకొట్టే శ్వేతసౌధాధినేత డోనాల్డ్ ట్రంప్ కూడా ఉభయ శ్రేయో దాయక ఒప్పందంపై సంతకాలు పెట్టేశారు. అయినా ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం ముణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది.

 Hormuz

Hormuz : దూకుడుని ప్రదర్శించడం యుద్ధనీతి రీతి కాదు

తాజా అమెరికా దాడులు హర్మూజ్ జల సంధిలో పనామా దేశ జెండాతో వెథులన్న ఎవర్ లౌలీ అనే నౌకపై ఇరాన్ దాడి చేసినందుకే తాము ఎదురు దాడులు చేసినట్లు యు.ఎస్ మిలిటరీ ప్రకటించింది. ఇలా ప్రకటించిన అనంతరం తాము 10 సైనిక లక్ష్యా లపై దాడులు చేసా మని వారి బులెటిన్ పేర్కొంది. ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ గోదాములపై అమెరికా దాడులు ముమ్మరం చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా కువైట్ బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా తమ నావికా, వైమానిక దళాలు సంయుక్తంగా క్షిపణి, డ్రోన్ ఆపరేషన్లు నిర్వహిం చినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్కోర్ సమాధా నమిచ్చింది. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఒక ఒప్పందం అమలులో ఉండగా వీటిని త్రోసిరాజని దూకుడుని ప్రదర్శించడం యుద్ధనీతి రీతి కాదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా ఉల్లంఘించిందని ఐఆర్ జిసి ఆరోపించింది. తాము అమెరికా దాడులకు ప్రతీకార దాడులనుమాత్రమే చేసినట్లు వివరణ కూడా ఇచ్చింది. దాడులను ఆపకుంటే ఇరాన్ను భూమ్మీద లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించగా, ఇకపై కాళరాత్రిని చూపిస్తామని అంతేస్థాయిలో ఇరాన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి.

సై అంటే సై

అమెరికా దాడు లకు తమ సమాధానం అత్యంత విధ్వంసకరంగా ఉంటుందని ఇరాన్ ముందుగానే వాచ్చరించినట్లు గానే. దూకుడుగా యుద్ధ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా కువైట్, బహ్రె యిన్ తదితర గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయ డాన్ని గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ ఖండించింది. ఇలాంటి దాడులను తాము సమ్మతించబోమని హెచ్చరించింది. ఆది నుంచీ ఇరాన్ తమ సార్వభౌమాధికారాన్ని కొల్లగొట్టే పరిస్థితి వస్తే తాము ఎంతకైనా తెగిస్తామని చెబు తూనే ఉంది. ఎంతో విచిత్రంగా ట్రంప్ తాజా హెచ్చరిక లున్నాయి. తన ట్రూత్ సోషల్లో ఆదివారం పెట్టిన పోస్టులలో ఇస్లామిక్ రిపబ్లిక్ మొత్తాన్ని నాశనం చేస్తా మని ప్రస్తావించారు. హేతుబద్ధంగా వ్యవహరించలేని పరిస్థితే వస్తే తాము ప్రారంభించిన పనిని సైనికవరంగా పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడ్తుందన్న సంకేతాలను కూడా పంపారు. ఇరు వర్గాలు ఏమాత్రం సంయమనం పాటించకుండా సై అంటే సై అంటూ యుద్ధంలోకి దిగేపరిస్థితులే తీసుకొచ్చారు. శాంతి ఒప్పం దాలంటేనే కొత్త ఆశలకు చివుళ్లు పోస్తాయి. కొన్ని సార్లు స్వల్ప ఉల్లంఘనలు జరిగినా, వెనువెంటనే సర్దుకుం టాయి. అది కట్టుబాటు ఉన్న సందర్భాల్లోనే సాధ్యం. కానీ ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందంలో తమ దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనుకోవ డం వలనే ఉల్లంఘనలకు ప్రాతిపదిక అయింది.

 Hormuz

భద్రతచర్యల ద్వారా శాంతి ప్రక్రియ

చిత్త శుద్ధి లేకుండా చేసుకునే ఒప్పందాలేమీ మనుగడ సాధించలేవు. శాంతి ప్రక్రియకు శాంతి ఒప్పం దంలోని భాగస్వామ్య దేశాలే సహకరించనప్పుడు శాశ్వత శాంతి ఎలా లభిస్తుందో ప్రాతినిధ్య దేశాలే యోచించుకోవాలి. పైగా పరస్పర విశ్వాసం పాదుగొల్పలేనప్పుడు ఒప్పందాలు ఎన్ని సజీవంగా ఉన్నా ప్రయోజనాలు సాధించవు. కేవలం సైనిక లేదా భద్రతచర్యల ద్వారా శాంతి ప్రక్రియ మొదలౌతుందని, అదే సుస్థిర శాంతికి, శాశ్వత శాంతికి దోహదపడుతుందని భావిస్తారు. కానీ తాజాపరిస్థితులను బట్టి ఒప్పందం నిలవదు. శాంతి పొసగదు. ఒమన్ తీరానికి చేరువగా హర్మూజ్కు కొత్త రవాణా మార్గాన్ని విస్తరించేందుకు అమెరికా నౌకాదళం నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలను ఆపాలని ఇరాన్ కోరు తోంది. ఆ జలసంధి మార్గం కూడా తమదేనని ఇరాన్ ఆకాంక్ష, హర్మూడ్పై ఎవరి జోక్యాన్ని ఇరాన్ సహించ లేక పోవడమే శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించింది. అది తేలితేనే కానీ శాంతికి మార్గం సుగమం కాదు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం అమెరికా ఇరాన్ల మధ్య సాగుతున్న చర్చలకు ప్రతిష్టంభనే ఏర్పడే పరిస్థితి వస్తే మళ్లీ ప్రపంచం యావత్తూ చిక్కుల్లో పడినట్లే. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయని సంబరపడిన వేళ మళ్లీ భీకర యుద్ధం తప్పదేమోనన్న అంచనాలతో జనం ఉలిక్కి పడ్డారు. ఏదైనా ఇరువర్గాలు సంయమనంతో వ్యవహరించడం మేలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

రేపు భారత్‌కు జపాన్ ప్రధాని సనాయే తకైచీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha