Assam Elections 2026: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్య రినికి భుయాన్ శర్మ, పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాము 100% క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు, సీఎం దంపతులు గౌహతిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also:India-Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ చిగురిస్తున్న మైత్రి
Himanta Biswa Sarma voting Jalukbari
Assam Elections 2026: జలుక్‌బారి – సీఎం కంచుకోట
- 25 ఏళ్ల ప్రస్థానం: 2001లో అస్సాం గణ పరిషత్ నేత భృగు కుమార్ ఫుకాన్‌ను ఓడించినప్పటి నుండి జలుక్‌బారి స్థానం హిమంత బిశ్వ శర్మకు పెట్టని కోటగా మారింది.
- గత రికార్డు: 2021 ఎన్నికల్లో ఆయన ఏకంగా 78.4% ఓట్లను (1,30,762 ఓట్లు) సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి రోమెన్ చంద్ర బోర్తకూర్ పై భారీ విజయాన్ని అందుకున్నారు.
- ప్రస్తుత పోరు: ఈసారి కూడా ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన, తన పాత రికార్డులను తిరగరాస్తానని ధీమాగా ఉన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

