Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మూకాశ్మీర్ గందర్‌బల్‌లో ఎన్‌కౌంటర్.. అడవిలో నక్కిన ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ గందర్‌బల్‌లో ఎన్‌కౌంటర్.. అడవిలో నక్కిన ఉగ్రవాది హతం

వార్త 2 months ago

Ganderbal Encounter: జమ్మూకాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో బుధవారం నాడు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం మరియు సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరపడంతో, సైన్యం దీటుగా సమాధానమిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు.

 Police Execute Flawless Plan: Terrorist Hiding in Forest Neutralized.

కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. పారిపోయిన మరో ఉగ్రవాది కోసం గాలింపు

అర్హమా అటవీ ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు ప్రాథమికంగా గుర్తించాయి. కాల్పుల సమయంలో ఒక ఉగ్రవాది హతమవగా, దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని మరో ఉగ్రవాది అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆ ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యం, అదనపు బలగాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది.

Ganderbal Encounter:సరిహద్దుల్లో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు భద్రతా దళాలు ‘ఆపరేషన్ ఆల్ అవుట్’లో భాగంగా వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. తాజా ఘటనతో గందర్‌బల్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన ఉగ్రవాది ఎటువైపు వెళ్లాడనే దానిపై నిఘా పెట్టడమే కాకుండా, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మృతి చెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha