Historic change in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది.
ఎప్పుడూ నెత్తుటి మరకలతో, ఉగ్ర దాడుల వార్తలతో సంచలనంగా మారే కశ్మీర్ లోయలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఉగ్రవాదం కోరలు చాచిన నాటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే, చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఏడాది మే (2026) నెలలో ఒక్క ఉగ్రవాద సంబంధిత మరణం కూడా నమోదు కాలేదు. పూర్తి ప్రశాంత వాతావరణం మధ్య ఈ మాసం ముగియడం రక్షణ రంగంలో ఒక అద్భుత విజయంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి.
Historic change in Jammu and Kashmir
అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 సంవత్సరపు మొదటి ఐదు నెలల కాలంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ 12 మందిలో 9 మంది ఉగ్రవాదులు కాగా, భద్రతా దళ సిబ్బందికి చెందిన ఒకరు, గుర్తింపు వివాదం ఉన్న ఒక స్థానికుడు, మరొక గుర్తుతెలియని వ్యక్తి ఉన్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఉగ్రదాడుల కారణంగా సాధారణ పౌరులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకపోవడం గమనార్హం.
Historic change in Jammu and Kashmir: ఒకప్పుడు రక్తసిక్తం.. నేడు ప్రశాంతం: నాటి మే నెలకు, నేటి మే నెలకు తేడా!
జమ్మూకశ్మీర్ పోలీస్ డేటా ప్రకారం, ఒకప్పుడు కశ్మీర్‌లో మే నెల వచ్చిందంటేనే అత్యంత హింసాత్మక వాతావరణం ఉండేది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 288 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగి 300కు చేరింది. ఆ సమయంలో దాదాపు ప్రతిరోజూ కశ్మీర్ లోయతో పాటు జమ్మూ ప్రాంతాల్లో పౌరులు, ఉగ్రవాదులు, సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, 2026 మే నాటికి ఈ మరణాల సంఖ్య ‘సున్నా’ (Zero) కు పడిపోవడం విశేషం. కశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ పూర్తిగా బలహీనపడిందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. “లోయలో ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతు ఇచ్చే వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

