Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జన నాయగన్' మూవీ లీక్ కేసులో పురోగతి: ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్

'జన నాయగన్' మూవీ లీక్ కేసులో పురోగతి: ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్

వార్త 2 months ago

Jananayagan Movie Leak: దళపతి విజయ్ సినిమా 'జన నాయగన్' పైరసీ, లీకేజీకి సంబంధించి తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసులో తాజాగా ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకోవడంతో, ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి (9) చేరింది.జన నాయగన్ సినిమా లీక్ వ్యవహారంలో టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత.. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 15వ తేదీన ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. జననాయగన్ సినిమాను పైరసీ చేసి లీక్ చేశారని ధృవీకరించుకొన్నాం. వారిని కోర్టులో హాజరుపరిచాం. ఆ తర్వాత జుడిషియల్ కస్టడీకి రిమాండ్‌పై తరలించాం. అందులో ఒకరు ఫ్రీలాన్స్ ఎడిటర్ ఉన్నారు అని వారు లేఖలో తెలిపారు.

Read Also: Meenakshi Seshadri Dance Video: 34 ఏళ్ల తర్వాత అదే గ్రేస్.. అదే మ్యాజిక్

Jananayagan Movie Leak: నిందితుల వివరాలు – లోపలి వ్యక్తే కారణం?

ఇక జననాయగన్ సినిమాకు సంబంధించి కేసు జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీని డౌన్ లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, పైరసీ కంటెంట్ ను షేరింగ్ చేయడం లాంటి వాటికి పాల్పడొద్దని తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా పైరసీకి పాల్పడుతున్నారన్న విషయం తెలిస్తే అందుకు సంబంధించిన వివరాలు, లింకులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ కు అందించాలని సూచించారు. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930 వివరాలు అందించాలని తెలిపారు.మొత్తానికి, 'జననాయగన్‌' లీక్ కేసులో కీలక నిందితులు పట్టుబడటంతో ఈ కేసు ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'మా ఇంటి బంగారం' నుండి 'తస్సాదియ్యా' వీడియో సాంగ్ రిలీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha