Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనాభా పెరుగుదల కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

జనాభా పెరుగుదల కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వార్త 2 months ago

Madhya Pradesh Govt Sensational Decision : దేశంలో చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తుంటే, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో జనాభా వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాల అర్హతకు సంబంధించిన ‘ఇద్దరు పిల్లల పరిమితి’ నిబంధనను (Two-child norm) పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ నిబంధనలలో అవసరమైన సవరణలు చేస్తూ వెంటనే ముసాయిదా (Draft) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గతంలో ఈ నిబంధన కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరటగా మారనుంది. మారుతున్న సామాజిక, జనాభా సమీకరణాల (Demographic changes) దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

Read Also : మోదీ పాలనలో కొత్త మధ్యతరగతి ..గణనీయంగా తగ్గిన పేదరికం

పాతికేళ్ల నాటి రూల్‌కు స్వస్తి.. నిరుద్యోగులకు పెరగనున్న ఉద్యోగ అవకాశాలు!

మధ్యప్రదేశ్‌లో జనాభాను అదుపు చేయాలనే ఉద్దేశంతో గత 2001వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక కఠినమైన రూల్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. జనవరి 26, 2001 తర్వాత ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించబడ్డారు. అయితే, దాదాపు పాతికేళ్ల (25 ఏళ్లు) నాటి ఈ పాత నిబంధన వల్ల ఎంతో మంది అర్హులైన నిరుద్యోగులు ప్రతిభాపాటవాలు ఉండి కూడా ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం మోహన్ యాదవ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆ అడ్డంకి పూర్తిగా తొలగిపోనుంది. ఈ సవరణ అమల్లోకి వస్తే, ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా రాబోయే ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అనర్హుల తొలగింపు కోసమే ఈ చర్యలు.. గ్యారెంటీ పథకాలపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha