Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనాభాలో ఎక్కువ.. ప్రగతి ప్రమాణాల్లో తక్కువ

జనాభాలో ఎక్కువ.. ప్రగతి ప్రమాణాల్లో తక్కువ

వార్త 5 days ago

Population : భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎది గింది. యువశక్తి, సహజ వనరులు, మేథో సంపత్తి, సాంకేతిక నైపుణ్యం వంటి అనేక బలాలు మనకు ఉన్నా యి.

అయినప్పటికీ విద్య, ఆరోగ్యం, పారిశుద్ధం, రహదారి క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రశ్నించే స్వేచ్ఛ, అవినీతి నిర్మూలన, బాధ్యతా యుత పాలన, పౌర బాధ్యత వంటి అనేక ప్రగతి ప్రమాణాల్లో మనం ఆశించిన స్థాయికి చేరుకోలేక పోతున్నాం. దీనికి కారణం కేవలం పాలకుల వైఫల్యమే కాదు, పాలితుల నిర్లక్ష్యమూ అంతే. అందుకే ఈ పరిస్థితిని ‘తిలా పాపం తలా పిడికెడు’ అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో పాలకులు, పాలితులు ఒకే రథానికి రెండు చక్రాలు. ఒకరు బాధ్యత తప్పినా, మరొకరు తమ విధిని విస్మరించినా సమాజం వెనుకబడు తుంది. దేశాభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ పథకాలు, భారీ ప్రాజెక్టులు మాత్రమే కాదు, పౌర స్వేచ్ఛతోపాటు, ప్రతి పౌరుడి బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా అంతేముఖ్యం. ప్రజాస్వామ్య దేశంలో పౌరస్పృహ పాలకుల, పాలితుల అత్యంత ప్రధాన బాధ్యత. ఇదే సమిష్టి ప్రగతికి మార్గదర్శి ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఎన్నో హామీలు ఇస్తారు. ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపా యాలు, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత వాటి లో చాలా హామీలు మరుగున పడిపోతాయి.

 Population

Population : ప్రజల సమస్యలను వినాలి

ప్రజల సమస్య ల కంటే రాజకీయ ప్రయోజనాలు, అధికారం నిలబెట్టుకోవ డమే కొందరు పాలకుల ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం పాలకుల మొదటి కర్తవ్యం. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయరాదు. అంతేకాదు జాగ్రత్తగా వినియోగించాలి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పైక్రమం తప్పకుండా సమాధానం చెప్పాలి. ప్రజల సమస్యలను వినాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చూడాలి. పాలనలో జవాబుదారీ తనం లేకపోతే ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది. అభివృద్ధి మందగిస్తుంది. కాబట్టి మంచి పాలనకు రాజకీయ నాయకులు ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజ స్వామ్యాన్ని ఓటు తో పాటు, ఎన్నికైన ప్రభుత్వాల (నాయకుల) జవాబుదారీ తనమే బలాన్ని చేకూర్చుతోంది. పాలకులను విమర్శించడం సులభం. కానీ మన బాధ్యతలను మనం ఎంతవరకు నిర్వ ర్తిస్తున్నామో కూడా ప్రశ్నించుకోవాలి. రోడ్లపై చెత్త వేయ డం, ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, క్యూలను పాటించకపోవడం, పన్నులు ఎగవేయ డం వంటి చర్యలు మన సమాజంలో తరచూ కనిపిస్తున్నా యి. శుభ్రమైన దేశం కావాలని కోరుకునే మనమే చెత్తను. రోడ్లపై పడేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. ప్రమా దాలు తగ్గాలని ఆశించే మనమే ట్రాఫిక్ నియమాలు ఉల్లం ఘిస్తే భద్రత ఎలా పెరుగుతుంది?.

ప్రభుత్వ ఆస్తులుప్రజల సొత్తే

ప్రభుత్వ ఆస్తులుప్రజల సొత్తే అని తెలుసుకున్నా వాటిని నిర్లక్ష్యంగా చూస్తే నష్టం చివరకు ప్రజలకే కదా!. పౌరస్మృహ అనేది పెద్ద పెద్ద ప్రసంగాల్లో ఉండేది కాదు. అది మన రోజువారీ ప్రవర్తనలో కనిపించాలి. ఇంటి ముందు శుభ్రత పాటించడం, చెత్తను నిర్దిష్ట ప్రదేశంలో వేయడం, ట్రాఫిక్ నియమాలను గౌరవిం చడం, నీటిని పొదుపుగా వాడడం, చెట్లను కాపాడడం, ప్రజా ఆస్తులను సంరక్షించడం ఇవన్నీ మంచి పౌరుడి లక్షణాలు. స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ డం కాదు? మన హక్కులను కాపాడుకుంటూనే, ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ప్రవర్తించడమే. బాధ్యతతో కూడిన స్వేచ్ఛే నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతి. ప్రజా స్వామ్యంలో ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే కాదు దేశ నిర్మాణంలో భాగస్వాములు. ఎన్నికల రోజున ఓటు వేసి ఐదేళ్లు మౌనంగా ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ప్రభుత్వ పనితీరును పరి శీలించడం, తప్పులను ఎత్తిచూపడం, మంచి కార్యక్రమాల ను ప్రోత్సహించడం ప్రతి పౌరుడి బాధ్యత. అదే సమ యంలో ప్రశ్నించే హక్కుతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా అవసరం. ప్రభుత్వం చేయాలి’ అనే భావ నతో మాత్రమే సరిపోదు. ‘నేను ఏమి చేయగలను?’ అనే ఆలోచన కూడా ఉండాలి. సమాజంలోని ప్రతి వ్యక్తి తన బాధ్యతను నిర్వర్తించినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుంది.

 Population

క్రమశిక్షణ, పౌరస్పృహ

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అక్కడి ప్రజల్లో ఉన్న క్రమశిక్షణ, పౌరస్పృహ, చట్టాల పట్ల గౌర వం ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. అక్కడ శిక్షల భయం కంటే బాధ్యతాభావమే ఎక్కువగా పనిచేస్తుంది. మన దేశం కూడా అదే దిశగా అడుగులు వేయాలి. పిల్లలలో చిన్నప్పటి నుంచే పౌర బాధ్యతలను పెంపొందించాలి. కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి మంచి పౌరులను తయారు చేయాలి. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కూడా ఈ విషయంలో చైతన్యం కల్పించాలి. ‘పౌరస్మృహ’ సివిక్ సెన్స్ ఒక ఉద్యమంగా మారినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. పాలి తులు తమ హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించకూ డదు. ఒకవైపు జవాబుదారీ పాలన, మరోవైపు బాధ్యతగల పౌరసమాజం ఉంటేనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పరువు పోయేది మనదే. నష్టం జరిగేది సమాజానికే. అందుకే కనీస ‘పౌరస్పృహే ప్రగతికి తొలి మెట్టు’ హక్కులు, బాధ్యతలు రెండు కళ్ళ లాంటివి. వీటి నుంచి పాలకులకు, పాలితులకు మినహా యింపు లేదు. నేటి నుంచే మనం పౌరస్పృహతో మెలుగు దాం. ప్రశ్నించే పౌరులుగా, బాధ్యతగల భారతీయులుగా ఎదుగుదాం. అప్పుడు మాత్రమే జనాభాలోనే కాదు, ప్రగతి ప్రమాణాల్లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం.

-మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper: epaper.vaarth.com

నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో UCC బిల్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha