Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనగణనలో కులాలను చేరుస్తున్నారా?

జనగణనలో కులాలను చేరుస్తున్నారా?

వార్త 2 weeks ago

Census : జనగణలో భాగంగా కులాల వారీగా జనగణన చేయడానికి కేంద్రప్రభుత్వం అంగీరించినప్పటికీ ఆచరణలో అమలుపై అనేక అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. భారతీయ జనగణన 2027ను రెండువిడ తలగా (2 ఫేజ్లుగా) చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మొదటి విడతలో గృహాలకు సంబంధించిన వివ రాలు సేకరిస్తే రెండో విడతలో జనాభా వివరాలను సేకరిస్తారు. మొదటి విడత 2026, ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు అంటే ఆరు నెలలు కొనసాగుతుంది. మొదటి విడతలో ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాల సేకరణలో భాగంగా ఇంటి నెంబరు, ఇంటి నిర్మాణానికి, ఫోర్ ఏర్పాటుకు వినియోగించిన మెటీరియల్, ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు. ఇంటిలో ఎన్ని గదులు వున్నాయి, ఇంటి యజమాని పేరు, ఇంటి నిర్మాణం జరిగి ఎంత కాలమైంది. తాగునీటి సదుపాయం వుందా? ఎన్ని బాత్రూ మ్లు వున్నాయి వంటి మొత్తం 34 ప్రశ్నలు వున్నాయి. ఈ ప్రశ్నలలో 13వ ప్రశ్న ఏమిటంటే.. ఇంటి యజమాని ఎస్సి, ఎస్టీ వర్గాలకు లేదా ఇతర వర్గాలకు చెందినవారా? అని వుంది. గృహ వివరాల సేకరణకు సంబంధించిన అప్లి కేషన్ ఫారాలలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారే కానీ ఒబిసిలకు సంబంధించిన ప్రస్తావనలేదు. కేంద్రప్రభుత్వం ఈసారి జనాభా లెక్కల సేకరణలో ఒబిసి కులాలకు సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా సేకరిస్తామని ప్రకటించింది. కానీ వివరాల సేకరణలో ఒబిసి అనే ప్రస్తా వన లేకుండా ఇతర వర్గాలతో కలిపి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే జనాభా గణనలో ప్రత్యేకంగా ఒబిసి కులాల వివరాలు సేకరిస్తారా.. లేదా? అనే అనుమానం కలుగు తోంది.

Read Also : NEET Re-exam : నీట్ రీ-ఎగ్జామ్: పేపర్ లీక్ పుకార్లను నమ్మవద్దు..NTA

 Census

Census : ఒబిసి వర్గాలలో ఆందోళన

రెండో విడత (సెకండ్ ఫేజ్) జనగణనలో మను షులకు సంబంధించిన వివరాలను 2026 అక్టోబరు నెల నుంచి 2027 మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2025, ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశ నిర్ణయం ప్రకారం కులాల వారీగా కూడా జనగణన జరుగుతుందని పేర్కొన్నారు. కానీ మొదటి విడతలో జరుగుతున్న గృహాల వివరాల సేకరణ ఆప్లికేషన్ ఫారమ్లో ఎస్.సి., ఎస్.టి.ల ప్రత్యేక ప్రస్తావన మాత్రమే వుంది. ఈ స్థితిలో రెండో విడత జనాభా వివరాల సేకరణలో కూడా ఎస్సి, ఎస్టీలను మాత్రమే గుర్తించి మిగిలిన కులాలను అన్ని అదర్స్ పేర్కొంటారేమోనని ఒబిసి వర్గాలలో ఆందోళన వ్యక్తం అవు తోంది. 90ఏళ్ల
క్రితం అంటే బ్రిటీషు ప్రభుత్వ కాలంలో 1931లో జరిగిన జనాభా గణన సమయంలో కులాల వారీ గా జనభా గణనచేశారు. మరల ఈనాటి వరకు జరపలేదు. మండల కమీషన్ ఈనివేదిక ప్రకారమే ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక సమర్పించి. ఈ 90 ఏళ్ల కాలంలో సామాజికంగానే కాకుండా జనాభా పరంగా ఎన్నో మార్పులు జరిగాయి. అంతేకాకుండా బిసి జాబితాలో వున్న కులాల సంఖ్య కూడా 83నుంచి 131కి చేరింది. కాని బీసీ కులాల రిజర్వేషన్లలో ఎటువంటి పెరుగుదల లేదు.

పరిమితులు విధించడం

రిజర్వే షన్లు 50 శాతానికి మించకూడదని చెప్పిన కోర్టు, తన తీర్పును తానే అధిగమిస్తూ కొత్తగా ఇడబ్ల్యూఎస్ (ఎకనా మికల్లీ వీకర్సెక్షన్స్) పేరిట అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్ కలిపించింది. జనాభాలో మొత్తంగా 16 శాతం కూడా లేని ఒసిలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించగా 52 శాతం వున్న ఒబిసిల రిజర్వేషన్లపై 27 శాతానికి పరిమితు లు విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేమెంతో మా కంత అనే నినాదంతో బిసి గణన జరిగి వారి జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఒబిసిలు దేశవాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. కులాల జనగణన వల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లుతుందని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతూ కులాలవారీగా గణనకు అభ్యంతరం తెలిపారు. గతంలో కులాల వారీగా జనగణన అధికారికంగా జరగకపోయినా వాస్తవంలో రాజకీయాలన్నీ కులాల ఆధా రంగానే రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకు కమ్యూ నిస్టు పార్టీలు మినహాయింపు కాదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాలలో ఏ కులానికి చెందిన ఓట్లు ఎన్నివున్నా యనే లెక్కల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నా రు. బీసీలలో కొంచెం సంఖ్యాపరంగా, ఆర్థికంగా స్థిరపడిన తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ, యాదవ, పద్మశాలీ, ముదిరాజ్, అగ్నికుల క్షత్రియ వంటి కులాల వారికి రెండు, మూడు సీట్లు కేటాయించి మిగిలిన అన్ని సీట్లలో అక్రులాల వారే చట్టసభలకు పోటీ చేస్తున్నారు. చేతివృత్తి సేవా కులైన నాయీబ్రాహ్మణ, రజక, విశ్వబ్రాహ్మణ, మేదర, కుమ్మరి, పూసల వంటి కులాలకు చెందిన వారిని ఏ మాత్రం పట్టించకోవడం లేదు. సంచార జాతులైన బుడ బుక్కల, గంగిరెద్దుల, కాటిపాపల, మొండి, బండ వంటి కులాల పరిస్థితి మరీ దయనీయంగా వుంది.


Census

ఆర్థిక సమానత్వం

కొంతమంది చెబుతున్నట్టుగా ఆర్థిక పరిస్థితితోనే సమానత్వం సాధ్యం అవుతందనే మాట నిజమైతే బీసీ కులాలకు చెందిన వారు అనేక మంది ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ పరంగా ఉన్నత స్థితిలో వున్నప్పటికీ రాజకీయపార్టీలు వారికి ఎందుకు చట్ట సభలలో పాతినిధ్యం కల్పించడం లేదు? మొత్తం జనాభా లో 52 శాతం బిసీలు వున్నారంటూ రాజకీయ పార్టీల నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తుంటారు. పార్లమెంటులో మొత్తం 542 స్థానాలు వుండగా, బిసిలే 52 శాతం నిష్పత్తి ప్రకా రం 276 స్థానాలలో బీసీలు ఎంపిక కావాల్సి వుంటుంది. కాని ప్రస్తుత పార్లమెంటు (లోక్సభలో) బీసీ వర్గాలకు సం బంధించి కేవలం 93 మంది (బిజెపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతోసహా అన్ని పార్టీల నుంచి) సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీల పరిస్థితి ఇదే విధంగా వుంది. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలలో జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తేఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీలో వున్న 296 స్థానాలకుగాను కనీసం 150 స్థానాలు బిసీలకు చెందాలి. కాని 60 నుంచి 90 స్థానాలను మాత్రమే బిసీలకు కేటాయిస్తూ మెజారిటీ స్థానాలను గెలుపు గుర్రాల పేరుతో పాలకవర్గాలకు చెందిన వారికి కేటాయిస్తున్నారు. చట్టసభలలో ఒబిసి సభ్యుల సంఖ్య ఏనాడు 35 శాతానికి మించలేదు. ఈస్థితిలో ప్రజల కోరిక ప్రకారం కేంద్రప్రభుత్వం ఒబిసిలకే పరిమితం కాకుండా మొత్తంగా కులాలవారీగా గణన చేస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో అనుమానాలు కలుగుతున్నాయి. భారత దేశం ప్రజాస్వామ్య దేశం. మనకు ఇష్టం వున్నాలేకపోయినా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే మార్పు తీసుకురావాలి. ఈ స్థితిలో సమాజంలోని అన్ని కులాలకువారికి మేలు జరగా లంటే కులాల వారీగా జనాభా గణన చేయడం ఒక్కటే పరిష్కారం. కేంద్రప్రభుత్వం తన ప్రకటనకు కట్టుబడి కులాల వారీగా జనగణను చేయడం అనివార్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఒబిసి, ఇడబ్ల్యూసి లబ్దిదారులకు చేరుతున్నాయా లేదా అనే అంశాలు తెలియాలంటే కులాల వివరాలు ప్రకటించడం అవసరం. ఒబిసి కులాల వివరాల సేకరణలో కేంద్రప్రభుత్వం మడమ తిప్పే ప్రయత్నం చేస్తే ఒబిసి కులాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనడటంలో ఎటువంటి సందేహం లేదు.

-అన్నవరపు బ్రహ్మయ్య

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై బ్యాన్ విధించిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha