Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జంతువుల హక్కులను పరిరక్షించాలి

జంతువుల హక్కులను పరిరక్షించాలి

వార్త 3 months ago

Animals :మానవులకు పెంపుడు జంతువులు ఎన్నో ప్రయో జనాలు చేకూరుస్తున్నాయి. కొద్దిపాటి ప్రేమాభి మానాలకు, సంరక్షణకే పెంపుడు జంతువులు ప్రేమను, విశ్వాసాన్ని కలిగి ఉంటాయి.

పెంచే వారినే సర్వస్వంగా భావిస్తాయి. అవి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తు, కుటుంబంలో సభ్యులుగా మారి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. ఒక రకంగా వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. భారత రాజ్యాంగపు 21వ అధికరణం వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన హక్కులను ధృవపరు స్తున్నది. భారత పౌరులకు జంతువులను పెంచి పోషించే హక్కును ఈ అధికరణం ధృవపరుస్తున్నది. జంతువుల పట్ల జాలి, పరితాపములను చూపాలని భారత రాజ్యాం గం 51 ఎ అధికరణం పౌరుల ప్రాథమిక బాధ్యతలను నిర్వచిస్తున్నది. కుక్క, పిల్లి, చేపలు, పక్షులుఏవైనా మనం పెంచే మూగజీవాలను ప్రేమగా చూసుకోవాలి. వాటికి అధి కంగా స్వేచ్ఛ కల్పించాలి.

Read Also : Heavy Rains in Telugu States: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.

 Animals

Animals : పరిమితులు దాటరాదు

విశాలమైన తిరుగాడే సౌకర్యాన్ని కలిగించాలి. పెంపకంలో జాగ్రత్తలు తీసుకుని, వాటిని సం తోషంగా ఉంచుతూ మచ్చిక చేసుకోవాలి. పెంపుడు జంతు వుల నివాస,తిరుగాడే స్థలాలను, ఉపయోగించే వస్తువుల ను శుభ్రపరచాలి. వాటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జంతువులకు ముందు జాగ్రత్తగా టీకామందులు వేయించ డం, నిర్లక్ష్యం వహించక, క్రమం తప్పకుండా వాటిని పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం విధిగా చేయాలి. జంతువుల పట్ల ప్రేమ, ముద్దు మురిపాలు పరిమితులు దాటరాదు. కానీ వాటితో మూతులు, ముక్కులు నాకించుకోవడం, అస్తమానం అంటిపెట్టుకుని ఉండడం మంచిది కాదు. కొన్ని చోట్ల పెంపుడు జంతువుల పట్ల ఎలా మసలుకోవాలనే అంశంపై ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. ఇదిలా ఉంటే మాంసం కోసం, వినోదం కోసం కొందరు అనేక రకాలుగా జంతువులకు కష్టనష్టాలు కలిగి స్తున్నారు. తమ వృత్తులకు, అవసరాలకు జంతువులను ఉపయోగించుకుంటూ వాటిని హింసిస్తున్నారు.

క్రూరచర్యలకు బాధ్యులైన వారిని శిక్షిస్తారు

ఆవు, మేక, గేదె మొదలైన జంతువులు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం, అలాగే కొన్నింటిని పోటీల్లో గెలుపు కోసం రసాయనాల ఇంజెక్షన్లు ఇస్తూ వాటిని హింసిస్తున్నారు. జంతు సంక్షే మానికి సంబంధించి 1960లో పార్లమెంటులో చట్టం రూపొందింది.
ఈ చట్టం ప్రకారం జంతువులను ఉద్దేశ్య పూర్వకంగా గానీ, నిర్లక్ష్యంగా గానీ బంధించినా, ఇబ్బంది కలిగించినా శిక్షార్హులు అవుతారు. 1960 డిసెంబర్ 26 నుంచి ఈ చట్టం అమలులో ఉంది. భారత పార్లమెంటు రూపొందించిన జంతువుల పట్ల క్రూరత్వం నివారణచట్టం సెక్షన్ 11 (1) నుండి (ఓ), ప్రకారం జంతువులను వేటాడ టం, స్వాధీనం లేదా పట్టుకోవడం, ఏ జంతువునైనా అవ యవమును తొలగించడం లేదా చంపడం వంటి అనేక ఇతర క్రూరచర్యలకు బాధ్యులైన వారిని చట్టం ద్వారా శిక్షిస్తారు.

 Animals

మానవీయంగా ప్రవర్తించడం

జంతురవాణాలో అనవసర హింసకు పాల్పడేవారికి, జంతువులను కిక్కిరిసినట్టుగా వాహనాల్లో నింపేవారికి, జంతువుల కాళ్ళు కట్టేసి వాహనాలపై తీసుకువెళ్ళే వారికి రూ.100 లేదా మూడు నెలల కారాగార శిక్ష లేదా రెండు శిక్షలూ కలిపి విధించవచ్చు. భారత శిక్షాస్మృతి సెక్షను 428, 429 కింద జంతువులను భయపెట్టడం, గాయ పరచడం చట్టవిరుద్ధం. జంతువులను లేదా జంతు సంరక్ష కులను భయ కంపితులను చేయడాన్ని 1860భారత శిక్షాస్మృతి సెక్షన్ 503ప్రకారం తెలిసి లేదా స్పృహతోచేస్తున్న నేరం గా పరిగణిస్తారు. ఇటువంటి వారిని ఎటువంటి వారంటు లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు. జంతుసంపదను పరి రక్షించడం, వాటిని వృద్ధిచేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరిబాధ్యత. మానవ మనుగడకు అనివార్యమైన పలు ప్రాయోజితాలైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధిచేయడం, మానవీయ కోణంలో చూడడం, తగిన స్వేచ్ఛకల్పించడం అందరి బాధ్యత. జంతువుల పట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం, ఈ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం అవసరం, అనివార్యం.

-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పెళ్లింట రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha