Dailyhunt
జపాన్ సంచలన నిర్ణయం: డేటింగ్ చేస్తే ఆర్థిక సాయం!

జపాన్ సంచలన నిర్ణయం: డేటింగ్ చేస్తే ఆర్థిక సాయం!

వార్త 1 week ago

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో దూసుకుపోతున్న జపాన్, ప్రస్తుతం తీవ్రమైన 'జనాభా సంక్షోభాన్ని' ఎదుర్కొంటోంది. యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడం, జననాల రేటు దారుణంగా పడిపోవడంతో దేశ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వింత పథకాలను ప్రవేశపెడుతోంది. జపాన్‌లోని కోచి ప్రిఫెక్చర్ రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చింది.

Read Also: Iran-America War: నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్

 Dating in Japan

Dating in Japan: కావాల్సిన అర్హత

20 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి వ్యక్తులు. డేటింగ్ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కోసం అయ్యే ఖర్చులో 20,000 యెన్లు (సుమారు రూ. 12,000) వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఫీజులు, నెలవారీ చెల్లింపుల రశీదులను సమర్పిస్తే, ఆ మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. జపాన్ రాజధాని టోక్యో నగరం మరింత ముందుకెళ్లి సొంతంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో చేరేవారు దాదాపు 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. వ్యక్తిత్వం, అలవాట్లు, పిల్లల పట్ల అభిప్రాయాల ఆధారంగా AI తగిన భాగస్వామిని సూచిస్తుంది.
మోసాలకు తావు లేకుండా ఇందులో చేరేవారు ఆదాయ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం ఇచ్చే ‘సింగిల్ స్టేటస్ సర్టిఫికేట్’ సమర్పించాలి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తర్వాతే అనుమతి లభిస్తుంది. జపాన్‌లో యువత కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, ఒంటరిగా ఉండేందుకే మొగ్గు చూపడం వల్ల జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడుతుందని ప్రభుత్వం భయపడుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

హర్ముజ్ జలసంధిపై రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha