Pakistan Asian Games 2026 Squad: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2026 (Asian Games 2026) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ పురుషుల జట్టును ప్రకటించింది.
జూన్ 10 (బుధవారం) న బోర్డు 15 మంది సభ్యులతో కూడిన సరికొత్త యువ జట్టును ఖరారు చేసింది. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ వంటి సీనియర్ స్టార్ ఆటగాళ్లను పూర్తిగా పక్కనబెట్టి.. యువ రక్తాన్ని ప్రోత్సహించే దిశగా పీసీబీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జట్టుకు నయా కెప్టెన్‌గా 30 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఎంపికవగా, యువ హిట్టర్ అబ్దుల్ సమద్ (Abdul Samad) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు భర్తీ చేయనున్నాడు.
Read also:Srilanka Vs India : ఉత్కంఠ పోరు.. భారత్ విజయం
కెప్టెన్, వైస్ కెప్టెన్ ట్రాక్ రికార్డ్
Sahibzada Farhan Named Captain; No Babar Azam & Shaheen Afridi
- సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్): ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఫర్హాన్‌కు బోర్డు మొదటిసారి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇప్పటివరకు ఆడిన 46 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 1,305 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్): పాక్ తరఫున ఇప్పటివరకు 5 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఇతనికి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సమద్ భాగమయ్యాడు.
అరంగేట్రం చేయని నలుగురు యువకులు
టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం పీసీబీ నలుగురు సరికొత్త అన్‌క్యాప్డ్ (ఇప్పటివరకు టీ20 అరంగేట్రం చేయని) ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది:
- అకిఫ్ జావెద్
- అలీ రజా
- మాజ్ సదాఖత్
- సాద్ మసూద్
Pakistan Asian Games 2026 Squad: లాహోర్‌లో వైట్-బాల్ శిక్షణ శిబిరం (NCA Camp)
ఆసియా క్రీడలకు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో 14 మంది జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) వైట్-బాల్ క్యాంపు శిక్షణలో భాగం కానున్నారు. జూన్ 15 నుండి 18 వరకు లాహోర్‌లో ఈ స్పెషల్ క్యాంప్ జరగనుంది. నేషనల్ కోచ్‌లు మరియు మెడికల్ స్టాఫ్ పర్యవేక్షణలో ఆటగాళ్ల ఫిట్‌నెస్, పవర్‌హిట్టింగ్ స్కిల్స్ మరియు అంతర్జాతీయ ప్రమాణాలపై ఇక్కడ ప్రత్యేక వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ, తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

