Mahabubnagar News: జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆలోచనతో, ప్రతినెల లక్ష రూపాయల తన సొంత నిధులతో అత్యంత పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేస్తూ వస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.
Read Also : Registration Numbers : కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి తెలంగాణ రవాణా శాఖ ఊరట
Committed to the welfare of journalists: Yennam Srinivas Reddy
Mahabubnagar News: బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ
కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స చేసుకున్న ఏబీఎన్ వీడియో జర్నలిస్టు సంతోష్ కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20,000 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, క్రమం తప్పకుండా మందులు వాడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ షావలి ఇమాముద్దీన్ జంగికి మందుల ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.
సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్నారని, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

