Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జవహర్‌నగర్‌ దోపిడీ కేసులో పురోగతి: నేపాల్ సరిహద్దుల్లో దొరికిన ఘరానా ముఠా

జవహర్‌నగర్‌ దోపిడీ కేసులో పురోగతి: నేపాల్ సరిహద్దుల్లో దొరికిన ఘరానా ముఠా

వార్త 1 week ago

సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను కట్టేసి, మత్తుమందు ఇచ్చి భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠా కేసును పోలీసులు ఛేదించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నమ్మకంగా చేరి.. రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర మోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మిల వద్ద మీనా, రమేశ్ అనే నేపాలీ దంపతులు నమ్మకంగా పనిలో చేరారు.

Read Also: UP Insta Marriage Dispute: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పెళ్లి మండపంలో డ్రామా: వరుడిపై వధువు బంధువుల దాడి!

 Secunderabad Jawaharnagar

Secunderabad Jawaharnagar: పుట్టినరోజు వేడుకల పేరిట కుట్ర

ఈనెల 11న (సోమవారం) తమ బంధువుల పుట్టినరోజు వేడుకలను ఇంట్లోనే జరుపుకుంటామని యజమానుల అనుమతి తీసుకున్నారు. ఇందుకోసం మరో నలుగురు బంధువులను పిలిపించుకున్నారు. దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేశారు. అనంతరం వారికి మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారం, 20 కిలోల వెండి, నగదుతో పాటు 3 వేల అమెరికన్ డాలర్లు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని దోచుకుని పారిపోయారు.

పోలీసుల దర్యాప్తు – అరెస్ట్ వివరాలు
మరుసటి రోజు మధ్యాహ్నం బాధితులకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాన నిందితులైన మీనా, రమేశ్ దంపతులను నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిని పీటీ (PT) వారెంట్‌పై హైదరాబాద్ తరలిస్తున్నారు.ఈ కేసులో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. వీరిని పనిలో చేర్పించిన భీమ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు వదిలివెళ్లిన ద్విచక్ర వాహనాన్ని యాప్రాల్ పెట్రోల్ బంక్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha