Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జయహో బీసీ' అంటున్న సీఎం చంద్రబాబు

'జయహో బీసీ' అంటున్న సీఎం చంద్రబాబు

వార్త 2 weeks ago

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో వర్చువల్‌గా సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 40 శాతం మేర సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం ద్వారా వారికి మరింత ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 'జయహో బీసీ!.. జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. బీసీ వర్గాలకు కూటమి అందిస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని, ఈ వర్గాల మద్దతును మరింత బలోపేతం చేసుకునేలా ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

నేతల పనితీరుకు రేటింగ్స్.. కూటమి బలోపేతమే లక్ష్యం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి భవిష్యత్తుకు అత్యంత కీలకమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను పెంచేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నేతల పనితీరును అంచనా వేసి రేటింగ్స్ ఆధారంగా వారికి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో బాధ్యతను పెంచే ప్రయత్నం చేశారు. స్థానిక స్థాయిలో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి పట్ల విశ్వాసాన్ని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే కూటమి రాజకీయ బలం మరింత పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీసీ వర్గాల ప్రాతినిధ్యంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఏపీ ఈ పంట కేవైసీ అప్‌డేట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha