Sadaa Actress: దర్శకుడు తేజ రూపొందించిన 'జయం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి సదా, తన తొలి చిత్రంతోనే 'వెళ్ళవయ్యా వెళ్ళూ' అంటూ కుర్రకారు మనసు దోచుకున్నారు.
ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కానీ, ఈ చిత్రంలో తాను చేసిన ఒక సీన్ ఇప్పటికీ తనను బాధపెడుతూనే ఉంటుందని సదా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో తాను అనుభవించిన మానసిక వేదన గురించి సదా వివరించారు.

వద్దన్నా వినని దర్శకుడు
‘జయం’ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో కథానాయికను లోబర్చుకోవాలనే క్రమంలో, హీరో కళ్లముందే ఆమె బుగ్గపై గోపీచంద్ నాలుకతో నాకే ఒక అసహ్యకరమైన సన్నివేశం ఉంటుంది. ఈ సీన్ చేయడానికి సదా మొదట అస్సలు ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని దర్శకుడు తేజ దృష్టికి తీసుకెళ్లినా, సినిమాకు ఈ సీన్ హైలైట్ అవుతుందని, పాత్ర స్వభావాన్ని తెలపడానికి ఇది అవసరమని చెప్పి తనతో బలవంతంగా చేయించారని ఆమె తెలిపారు.

Sadaa Actress: పదేపదే మొహం కడుక్కుంటూ.
ఆ సన్నివేశం పూర్తయిన తర్వాత సదా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారట. షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ ఆలోచన తనను వదల్లేదని, అపరాధ భావంతో పదేపదే మొహం కడుక్కున్నానని ఆమె చెప్పారు. తన జీవితంలో ఆ సీన్ ఎందుకు చేశానా అని ఇప్పటికీ బాధపడుతుంటానని, ఆ సమయంలో వెక్కివెక్కి ఏడ్చానని పేర్కొన్నారు. ఏది ఏమైనా, ఆ సినిమా సదా కెరీర్‌ను మలుపు తిప్పి, ఆమెను అగ్ర తారల్లో ఒకరిగా నిలబెట్టింది.



Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

